సారాంశం

Time Traveler Predicts: 2025లో జరగబోయే విపత్తులు ఇవేనంటూ ఓ టైమ్ ట్రావెలర్ విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తుఫానుల ప్రభావం, దేశాల మధ్య అంతర్యుద్ధం, గ్రహాంతరవాసుల రాక, భారీ సముద్ర జీవి గుర్తింపు ఇలా చాలా షాకింగ్ విషయాలు చెప్పాడు. వాటి గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.  

భవిష్యత్తులోకి వెళ్లి వచ్చానని చెప్పుకునే ఎల్విస్ థామ్సన్ అనే వ్యక్తి 2025లో జరిగే ముఖ్యమైన విషయాల గురించి అంచనా వేశాడు. ఎల్విస్ థామ్సన్ తనను తాను టైమ్ ట్రావెలర్ అని ప్రకటించుకున్నాడు. జనవరి 1న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు. అది ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో 2025లో ఐదు ప్రత్యేక తేదీల్లో విపత్తులు జరుగుతాయని చెప్పాడు.

ఈ ఏడాదిలో జరగబోయే 5 ముఖ్య సంఘటనలు

ఏప్రిల్ 6న గంటకు 1,046 కిలోమీటర్ల వేగంతో 24 కిలోమీటర్ల వెడల్పుతో ఒక తుఫాను అమెరికాలోని ఓక్లహోమాను ప్రాంతాన్ని నాశనం చేస్తుందని థామ్సన్ అంచనా వేశాడు.

మే 27న అమెరికాలో రెండో అంతర్యుద్ధం మొదలవుతుందని, అది టెక్సాస్ విడిపోవడానికి దారితీస్తుందన్నాడు. అంతేకాకుండా అణుయుద్ధాలు జరిగే ప్రపంచ యుద్ధానికి ఇదే కారణమవుతుందని, చివరికి అమెరికాను ప్రమాదంలోకి నెడుతుందని కూడా చెప్పాడు.

ఇది కూడా చదవండి ప్రపంచంలో డేంజరస్ సబ్‌మెరైన్స్ ఇవే

సెప్టెంబర్ 1న ఛాంపియన్ అనే గ్రహాంతరవాసి భూమికి వస్తాడని చెప్పాడు. ఈ ఛాంపియన్ 12,000 మంది మనుషులను వారి రక్షణ కోసం వేరే గ్రహానికి తీసుకువెళ్తాడట. భూమికి హాని కలిగించే ఉద్దేశంతో వచ్చే శత్రు గ్రహాంతరవాసుల గురించి కూడా హెచ్చరించాడు.

సెప్టెంబర్ 19న అమెరికా తూర్పు తీరాన్ని ఒక పెద్ద తుఫాను తాకుతుందని థామ్సన్ అంచనా వేశాడు.

నవంబర్ 3న నీలి తిమింగలం కంటే ఆరు రెట్లు పెద్దదైన ఒక భారీ సముద్ర జీవి పసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తుందని తెలిపాడు. దీనికి సెరీన్ క్రౌన్ అని పేరు పెడతారని అన్నాడు.

థామ్సన్ వీడియోకు ఏకంగా 20 మిలియన్ల వ్యూస్

థామ్సన్ వీడియో బాగా వైరల్ అయింది. 20 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. దీనిపై ఎక్కువ మంది తమ కామెంట్ల ద్వారా స్పందించారు. అయితే కొంతమంది అతని అంచనాలన్నీ తప్పని, ఫేమ్ కోసం అతను ఇలాంటివి ప్రిడిక్ట్ చేస్తాడని కామెంట్స్ చేశారు. 

ఈ వీడియోను సేవ్ చేసుకుంటున్నానని, థామ్సన్ అంచనాలు తప్పని తేలితే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఒక యూజర్ ఘాటుగా కామెంట్ చేశాడు. ఇలా చాలా మంది వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు.