దేశీయ ఎగుమతుల్లో వరుసగా మూడో నెల కూడా క్షీణత

దేశీయ ఎగుమతుల్లో ప్రతికూలత కొనసాగుతూనే ఉన్నది. అక్టోబర్ నెలలో వరుసగా మూడో నెల ప్రతికూలత నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఎగుమతుల్లో 1.11% క్షీణత నమోదైంది. ఫలితంగా వాణిజ్య లోటు 11 బిలియన్ల డాలర్లకు చేరుకున్నది.  

Third month was negative As a series of Indian exports

న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతుల్లో వరుసగా మూడవనెలా ప్రతికూలతే నమోదైంది. అక్టోబర్‌లో అసలు వృద్ధి లేకపోగా మైనస్ 1.11 క్షీణత నమోదైంది. 2018 అక్టోబర్‌తో పోల్చిన 2019 అక్టోబర్‌ నెలలో ఎగుమతుల విలువ మైనస్1.11 శాతం తగ్గి, 26.38 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది.

పెట్రోలియం మైనస్ 14.6 శాతం, తివాచీ మైనస్ 17 శాతం, తోలు ఉత్పత్తులు మైనస్ 7.6 శాతం), బియ్యం మైనస్ 29.5 శాతం, తేయాకు మైనస్ 6.16 శాతం పడిపోయాయి. ఎగుమతులకు సంబంధించి 30 కీలక రంగాల్లో 18 క్షీణత నమోదు చేసుకున్నాయి. భారత్‌ ఎగుమతులు ఆగస్టులో మైనస్ 6 శాతం క్షీణతను నమోదు చేసుకుంటే, సెప్టెంబర్‌లో ఈ క్షీణత రేటు మైనస్ 6.57 శాతంగా ఉంది.  

also read సుప్రీం కోర్టులో సింగ్ బ్రదర్స్ కి చుక్కెదురు...

గతేడాది అక్టోబర్ నెలతో పోలిస్తే దిగుమతులు కూడా 16.31 శాతం పడిపోయాయి. విలువ రూపంలో 37.39 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు– దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 11 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. 

గతేడాది అక్టోబర్‌లో ఈ పరిమాణం 18 బిలియన్‌ డాలర్లు. శుక్రవారం విడుదలైన గణాంకాల ప్రకారం పసిడి దిగుమతులు 5 శాతం పడిపోయి 1.84 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  చమురు దిగుమతులు అక్టోబర్‌లో మైనస్ 31.74 శాతం క్షీణించి 9.63 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. 

also read భారత్ వృద్ధిరేటులో మూడీస్ మరింత కోత

చమురేతర దిగుమతులు మైనస్ 9.18 శాతం పడిపోయి 27.76 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకూ చూస్తే, ఎగుమతులు 2.21 శాతం తగ్గి 185.95 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

దిగుమతులు మైనస్ 8.37 శాతం క్షీణించి 280.67 బిలియన్‌ డాలర్లకు జారాయి. వెరసి వాణిజ్యలోటు 94.72 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నది. 2018 ఇదే కాలంలో వాణిజ్య లోటు 116.15 బిలియన్‌ డాలర్లుగా రికార్డైంది. ఇక సేవల రంగంలో సేవల ఎగుమతుల విలువ 17.22 బిలియన్‌ డాలర్లు ఉంటే, దిగుమతుల విలువ 10.92 బిలియన్‌ డాలర్లుగా నమోదైందని ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios