సుప్రీం కోర్టులో సింగ్ బ్రదర్స్ కి చుక్కెదురు...

మాల్విందర్, శివిందర్ సింగ్ రూ. 1,175 కోట్లు చొప్పున ఉన్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లపై కోర్టు ధిక్కరణ పిటీషన్‌ను సుప్రీం కోర్ట్  సమర్ధించింది. సింగ్ సోదరులిద్దరికీ భారీ జరిమానా సుప్రీం కోర్ట్  విధించింది.

singh brothers got penalty in supreme court justice

న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన దైచి సాన్క్యో  దాఖలు చేసిన పిటిషన్ కేసులో మాజీ రాన్‌బాక్సీ ప్రమోటర్లు మాల్విందర్ సింగ్, అతని సోదరుడు శివిందర్ సింగ్‌ను కోర్టు ధిక్కార కేసులో సుప్రీంకోర్టు దోషిగా తేల్చింది. జపాన్‌ ఫార్మా దిగ్గజం దైచీ శాంకో దాఖలు చేసిన పిటీషన్‌ను కోర్టు సమర్ధించింది.మాల్విందర్, శివిందర్ సింగ్ ఒక్కొకరికి రూ. 1,175 కోట్లు చొప్పున చెల్లించాలని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

 also read ద్రవ్యలోటుకు కళ్లెం వేయాలంటే ఐఓసీకి మంగళం

జపాన్ మాదకద్రవ్యాల తయారీ కంపెనీ  దైచి శాంకో సింగ్  సోదరులపై పిటిషన్ దాఖలు చేశారు. మలేషియా గ్రూప్ ఐహెచ్ హెచ్ హెల్త్‌కేర్ ఫోర్టిస్‌లో వాటాను నియంత్రించడాన్ని నిలిపివేసిన, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి తమ ఆస్తులను విక్రయించారంటూ ఆరోపించారు.ఫోర్టిస్‌కు ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ ఓపెన్ ఆఫర్‌పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

ఫోర్టిస్‌పై ధిక్కార కేసు విచారణకు వచ్చినప్పుడు ఓపెన్ ఆఫర్ సమస్య నిర్ణయించబడుతుందని కోర్టు తెలిపింది.కాగా 2008లో రాన్‌బాక్సీని దైచీ  శాంకో కొనుగోలు చేసింది.  అమ్మకం సమయంలో సింగ్ సోదరులు వాస్తవాలను దాచిపెడుతూన్నారని డైచి శాంకో ఆరోపించారు.

also read భారత్ వృద్ధిరేటులో మూడీస్ మరింత కోత

అనంతరం సింగ్‌ బ్రదర్స్‌ సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు. కోర్ట్ నిర్ణయంలో దిక్కరణకు పాల్పడినట్లయితే జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తూ, 2019, ఏప్రిల్‌లో తీర్పును రిజర్వులో ఉంచింది. ఇది ఇలా వుంటే వేలకోట్ల నిధుల మళ్లింపు ఆరోపణలతో గత నెలలో సింగ్‌ బ్రదర్స్‌ను ఢిల్లీ  ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios