Thinnest Smartphone: ప్రపంచ మార్కెట్ లోకి మరో సన్నని స్మార్ట్ ఫోన్ రాబోతోంది. ఇప్పటి వరకు ఆపిల్, శాంసంగ్ కంపెనీలు మాత్రమే సన్నని స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేశాయి. ఇప్పుడు వీటికి పోటీగా ఓ సెల్ ఫోన్ కంపెనీ స్పార్క్ స్లిమ్ అనే సన్నని స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. ఆ ఫోన్ ఫీచర్లు తెలుసుకుందాం రండి.

స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు సన్నని ఫోన్లను రిలీజ్ చేసే కొత్త ట్రెండ్ ని స్టార్ట్ చేశాయి. ఇప్పటికే  ఆపిల్, శాంసంగ్ కంపెనీలు ఇలాంటి సన్నని ఫోన్లను తీసుకొచ్చి వినియోగదారుల ఫేవరెట్ గా మారాయి. ఇప్పుడు ఈ కంపెనీలకు పోటీగా టెక్నో సంస్థ స్పార్క్ స్లిమ్ అనే సన్నని స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది ప్రపంచంలోనే అతి సన్నని ఫోన్ అని కంపెనీ ప్రకటించింది. ఎందుకంటే దీని మందం జస్ట్ 5.75 మి.మీ మాత్రమే. ఇంత సన్నని స్మార్ట్‌ఫోన్‌లో కూడా కెమెరా సిస్టమ్, పెద్ద బ్యాటరీని ఫిక్స్ చేశారు. పోటీ కంపెనీలను తట్టుకొని ఇది కచ్చితంగా కస్టమర్లను అట్రాక్ట్ చేస్తుందని టెక్నో సంస్థ భావిస్తోంది. ఈ ఫోన్ ఫీచర్లు ఇక్కడ ఉన్నాయి.

టెక్నో స్పార్క్ స్లిమ్ ఫీచర్లు 

స్పార్క్ స్లిమ్ 6.78 ఇంచ్ 3D వంగిన అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్, 1224p (1.5K) రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 4500 నిట్స్ మాక్సిమం బ్రైట్ నెస్‌తో, స్ట్రాంగ్ అవుట్‌డోర్ లైట్లు ఉండటం వల్ల స్క్రీన్ విజిబిలిటీ చాలా బాగుంది. సెల్ ఫోన్ స్ట్రక్చర్ ను అలాగే ఉంచుతూ బరువును తగ్గించడానికి టెక్నో సంస్థ ఈ ఫోన్ తయారీలో స్టెయిన్‌లెస్ స్టీల్, రీసైకిల్ చేసిన అల్యూమినియంను ఉపయోగించింది. 

ఈ సన్నని ఫోన్‌లో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ కెపాసిటీ ఉన్న 5,200mAh బ్యాటరీ ఉంది. ఇది రోజంతా ఛార్జింగ్ వస్తుందని టెక్నో సంస్థ చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుందని సమాచారం. ఎందుకంటే చిప్‌సెట్ వివరాలు ఇంకా రిలీజ్ చేయలేదు.

స్పార్క్ స్లిమ్ కెమెరా ఫీచర్లు 

స్పార్క్ స్లిమ్ 13MP ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ 50MP వెనుక కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది రీసైకిల్ చేసిన అల్యూమినియం, స్టెయిన్‌లెస్ స్టీల్ యూనిబాడీతో తయారైంది. ఈ స్పార్క్ స్లిమ్ ఫోన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందనే వివరాలు ఇంకా రిలీజ్ చేయలేదు. 

ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ టెక్నాలజీ ఎక్స్‌పర్ట్స్ ని కూడా అట్రాక్ట్ చేస్తోంది. దీని సన్నని డిజైన్, పవర్ఫుల్ ఫీచర్లు, స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒక కొత్త ట్రెండ్‌ను స్టార్ట్ చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. 

ఇది కూడా చదవండి ఐఫోన్ 16eకి పోటీగా ఉన్న టాప్ 5 ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవే