iPhone 16e: ఐఫోన్ 16eకి పోటీగా ఉన్న టాప్ 5 ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవే.
iPhone 16e: ఐఫోన్ 16e ధర చూస్తే కళ్లు తిరుగుతున్నాయి కదా.. రూ.70 వేలు పెట్టి మీరు ఐఫోన్ కొనలేరా? అయితే తక్కువ ధరలో ఐఫోన్ 16e కి పోటీగా ఉన్న టాప్ 5 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు ఇక్కడ చూడండి. ఈ ఫోన్లు మంచి పనితీరు, కెమెరా క్వాలిటీ, బ్యాటరీ లైఫ్ అందిస్తాయి. వాటి ధరలు, ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఫోన్ 16e ధర చూసి చాలా మంది నిరాశ చెందారు. ఎన్నో డిస్కౌంట్ల మధ్య ఇండియా మార్కెట్ లో ఇది రూ.69,900 లకు లభిస్తోంది. అయినా ఐఫోన్ ప్రేమికులు నిరాశ చెందారు. అలాంటి వారి కోసం ప్రత్యామ్నాయ ఫోన్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
వన్‌ప్లస్ 13R (OnePlus 13R)
ఈ ఫోన్ 6.77 అంగుళాల ProXDR LTPO అమోల్డ్ స్క్రీన్ ను కలిగి ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ మాక్సిమం బ్రైట్ నెస్, 1.5K రిజల్యూషన్ ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 CPU, అడ్రినో 830 GPU, 16GB వరకు RAM కెపాసిటీ, UFS 4.0 స్టోరేజ్ కాన్ఫిగరేషన్ తో వస్తోంది. ఇందులో మొత్తం మూడు కెమెరాలు ఉన్నాయి. అవి 50 MP మెయిన్ సెన్సార్(సోనీ LYT-700), 50 MP టెలిఫోటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్), 8 MP అల్ట్రా వైడ్ లెన్స్. అంతేకాకుండా 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 mAh బ్యాటరీ ఉంది.
దీని ధర మార్కెట్ లో సుమారు రూ. 40,000 వరకు ఉంది.
గూగుల్ పిక్సెల్ 8a (Google Pixel 8a)
గూగుల్ పిక్సెల్ ఫోన్లకు మంచి క్రేజ్ ఉంది. అందులోనూ పిక్సెల్ 8a మంచి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ 6.1 అంగుళాల ఫుల్ HD+ OLED HDR స్క్రీన్ తో వస్తుంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఉంది. గూగుల్ తన సొంత టెన్సర్ G3 ప్రాసెసర్ ను ఇందులో ఉపయోగించింది. 8GB వరకు RAM, 256GB వరకు UFS 3.1 స్టోరేజ్ ఉన్నాయి. గూగుల్ ఏడు సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌లు, సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇచ్చింది. కెమెరాల విషయానికొస్తే 13 MP ఫ్రంట్ కెమెరా, 64MP మెయిన్ సెన్సార్, 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్న డ్యూయల్ లెన్స్ సిస్టమ్ ఈ ఫోన్ లో ఉన్నాయి. దీని ధర సుమారు రూ.37,999.
శాంసంగ్ గెలాక్సీ S24 FE(Samsung Galaxy S24 FE)
శాంసంగ్ గెలాక్సీ ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. S24 FE మోడల్ లో 4nm టెక్నాలజీతో చేసిన ఎక్సినోస్ 2400e ప్రాసెసర్ ఉపయోగించారు. 4,700mAh బ్యాటరీ ఉండటం వల్ల ఎక్కువ సేపు ఛార్జింగ్ నిలుస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ అమోల్డ్ 2X స్క్రీన్ ఉంది. ఇందులో మూడు బ్యాక్ సైడ్ కెెమెరాలు ఉన్నాయి. అవి 50 MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 8MP టెలిఫోటో లెన్స్ కలిగి ఉన్నాయి. 10 MP కెపాసిటీతో ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.
మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా (Motorola Edge 50 Ultra)
6.7 అంగుళాల ఫుల్ HD+ OLED స్క్రీన్ తో 2500 నిట్స్ మాక్సిమం బ్రైట్ నెస్, 144 Hz రిఫ్రెష్ రేట్, 10 బిట్ కలర్ డెప్త్ వంటి ఫీచర్స్ తో మార్కెట్ లో వినియోగదారులకు ఫేవరేట్ గా మారింది మోటరోలా ఎడ్జ్ ఫోన్. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 CPU, అడ్రినో 735 GPU ఉన్నాయి. 50 MP మెయిన్ సెన్సార్ (OIS), 50 MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 64 MP టెలిఫోటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్) ఉన్న మూడు లెన్స్ సిస్టమ్ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,500mAh బ్యాటరీ ఉంది. 50 MP ఫ్రంట్ కెమెరా మీకు అద్భుతమైన ఫోటోలను అందిస్తుంది. ప్రస్తుతం దీని ధర రూ.49,999 ఉంది.
షావోమి 14 CIVI (Xiaomi 14 CIVI)
6.55 అంగుళాల క్వాడ్ వంపు అమోల్డ్ స్క్రీన్ షావోమి 14 సివి ఫోన్ కి ప్రత్యేక ఆకర్షణ. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 CPU వల్ల ఈ ఫోన్ మంచి పనితీరును కనబరుస్తుంది. 12 GB వరకు RAM, 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉన్న ఈ ఫోన్ ధర రూ.43,999. పలు ఆన్ లైన్ ప్లాట్ ఫాంలలో దీని ధర మరింత తగ్గే అవకాశం ఉంది.