Asianet News TeluguAsianet News Telugu

ప్రయాణికులకు గుడ్ న్యూస్...ఇకపై విమానాల్లో వై-ఫై సేవలు...

భారతదేశంలో వై-ఫై సేవలు అందించిన మొట్టమొదటి భారతీయ సంస్థగా నెల్కో నిలిచింది. ఆకాశంలో ఎగిరే విమానాలలో వై-ఫై  సేవలు అందిస్తూ కొత్త శకానికి నాంది పలికింది.

tata groups nelco to offer wifi services on planes over indian airspace
Author
Hyderabad, First Published Feb 20, 2020, 11:11 AM IST

టాటా ఎంటర్‌ప్రైజ్, ప్రముఖ విసాట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ నెల్కో భారతదేశంలో ఏరో ఇన్-ఫ్లైట్ కమ్యూనికేషన్ (ఐఎఫ్‌సి) సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. భారతదేశంలో వై-ఫై సేవలు అందించిన మొట్టమొదటి భారతీయ సంస్థగా నెల్కో నిలిచింది. ఆకాశంలో ఎగిరే విమానాలలో వై-ఫై  సేవలు అందిస్తూ కొత్త శకానికి నాంది పలికింది.

ఈ సేవలను అందించడానికి నెల్కో పానాసోనిక్ ఏవియానిక్స్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సేవలను ప్రారంభించడంతో భారతదేశంతో పాటు ఇతర దేశీయ విమానయాన సంస్థల అంతర్జాతీయ విమానంలో ప్రయాణించే ప్రయాణీకులకు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను అందించడం సాధ్యమవుతుంది.

also read ట్రంప్‌ విమానంలో ఉండే సౌకర్యాలు చూస్తే షాకవ్వాల్సిందే...

ఏరో ఐఎఫ్‌సి సేవలు విమానయాన ప్రయాణీకులకు ఇంటి వద్ద, కార్యాలయంలో  ఆటంకాలు లేని నిరంతర  ఇంటర్నెట్ సేవల అనుభవాన్ని అందిస్తాయి. అంతేకాకుండా విమానయాన సంస్థలు ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి అదనపు ఆన్‌బోర్డ్ ఆదాయ మార్గాలను తెరవడానికి ఇంకా విమాన కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడానికి ఇది అవకాశాన్ని ఇస్తుంది.

also read ట్రంప్‌ పర్యటనపై ఇండియన్ కార్పొరేట్ల భారీ ఆశలు....

విస్టారా ఇప్పటికే ఏరో ఐఎఫ్‌సి సేవలకు సైన్ అప్ అయ్యింది. ఈ సేవలను అతి త్వరలో ప్రారంభించిన మొదటి దేశీయ విమానయాన సంస్థగా అవతరించింది. ఈ కొత్త అభివృద్ధిపై నెల్కో ఎండి & సిఇఒ పిజె నాథ్ మాట్లాడుతూ, “దేశంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఏరో ఐఎఫ్‌సి సేవలను అందించడంలో నెల్కో నాయకత్వం వహిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము.

భారతదేశంలో విమానయాన రంగం ప్రయాణీకుల సేవల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. మేము వినియోగదారులకు ఈ సేవలు అందించడానికి పానాసోనిక్ ఏవియానిక్స్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios