న్యూ ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మెలానియా  బోయింగ్ 747-200 బి సిరీస్ విమానంలోఇండియాలో చేరుకొనున్నారు.ఈ విమానాన్ని "ఎయిర్ ఫోర్స్ వన్" అని పిలుస్తారు.ప్రస్తుతం అమెరికా అధ్యక్షుని ఎయిర్ ఫోర్స్ వన్ ఇది వరకు పనిచేసిన అధ్యక్షుల విమానాలతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న బోయింగ్ 747-200బీ విమానం అత్యంత శక్తివంతమైనది ఇంకా ఇది అతి పెద్ద అధ్యక్ష విమానం కూడా.

బిజినెస్ ఒప్పందంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24న భారత్‌లో అడుగుపెట్టనున్నారు. పర్యటనలో భాగంగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఆయన భార్య మెలానియాతో కలిసి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. 

అమెరికా అధ్యక్షుడి భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో ట్రంప్‌ దంపతులు భారత్‌ పర్యటనకు రానున్నారు. బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ సిరీస్ లో  బోయింగ్ 747-200బి సిరీస్ విమానం ఒకటి. ఈ విమానానికి చివరిలో 28000, 29000 అనే రెండు  కొడ్స్ ఉంటాయి.

also read పడిపోయిన బంగారం ధరలు... 10 గ్రాములకు ఎంతంటే..?

ఈ విమానానికి యుఎస్ వైమానిక దళం వి‌సి-25ఏ అనే హోదా కూడా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ప్రపంచంలో ఎక్కడైనా ప్రయాణించడానికి ఈ విమానం సిద్ధంగా ఉంటుందని వైట్ హౌస్ తెలిపింది."యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా," అమెరికా జెండా, యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ పదాలతో ముద్ర దీనిపై ఉంటుంది.1962 లో, అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెన్నెడీ  కోసం ప్రత్యేకంగా నిర్మించిన జెట్‌లో ప్రయాణించాడు. 

ఇది సాధారణ బోయింగ్ ప్యాసింజర్ విమానాలలాగా కాకుండా ఆకాశంలో ఉండగా ఇంధనం నింపుతుంది. ఎయిర్ ఫోర్స్ వన్ అమెరికా ప్రెసిడెంట్ ఎక్కడికి ప్రయాణించాల్సి వచ్చిన తీసుకెళ్లగలదని వైట్ హౌస్ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. 747-200బీ రెక్కల పొడవు 195 అడుగులు కాగా.. ఇది టేకాఫ్‌ తీసుకునేటపుడు మోయగలిగే బరువు 8,33,000 పౌండ్లు ఉంటుంది.  

 ఈ విమానంలో అధునాతన సురక్షిత సమాచార పరికరం కూడా ఇందులో ఉంది. యు.ఎస్ పై ఎలాంటి సమయంలోనైనా దాడి జరిగినప్పుడు విమానం మొబైల్ కమాండ్ సెంటర్‌గా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది.విమానంలోని "ఫ్లయింగ్ ఓవల్ ఆఫీస్" లో 4,000 చదరపు అడుగుల ఇంటీరియర్ స్థలం ఉంటుందని బోయింగ్ తెలిపింది. ప్రెసిడెంట్  సూట్, పెద్ద ఆఫీసు, టాయిలెట్, మీటింగ్ రూమ్స్ ఇందులో​​ఉన్నాయి.

also read వైరల్ గా మారుతున్న మరో కిల్లింగ్ గేమ్

ఎయిర్ ఫోర్స్ వన్ లో ఒక మెడికల్ సూట్‌ కూడా ఉంటుంది. అది ఆపరేటింగ్ రూమ్‌గా పనిచేస్తుంది ఇందులో ఎప్పటికీ ఒక వైద్యుడు ఉంటాడు. విమానంలో ఒకేసారి 100 మందికి ఆహారం అందించడానికి ప్రత్యేకమిన డైనింగ్ ఉంది.


సీనియర్ సలహాదారులు, సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్లు, ట్రావెలింగ్ ప్రెస్, ఇతర అతిథులతో సహా ప్రేసిడెంట్ తో పాటు ప్రయానించడానికి ఎయిర్ ఫోర్స్ వన్ లో వారికి క్వాటర్స్ కూడా ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో కూడా అవసరమైన సేవలను ప్రేసిడెంట్ కి అందించడానికి అనేక కార్గో విమానాలు ఎయిర్ ఫోర్స్ వన్ కంటే ముందు ప్రయాణిస్తాయి. ఎయిర్ ఫోర్స్ వన్  ప్రెసిడెన్షియల్ ఎయిర్‌లిఫ్ట్ గ్రూప్ చేత ఆపరేట్ చేస్తుంది.