Asianet News TeluguAsianet News Telugu

అక్షయతృతీయ: రిలయన్స్ డిజిటల్ సహా పలు సంస్థల ఆఫర్లు ఇవే..

మంగళవారం అక్షయ తృతీయ సందర్భంగా రిలయన్స్ డిజిటల్, జోయాలుక్కాస్, మలబార్ తదితర సంస్థలు తమ వినియోగదారులకు స్సెషల్ ఆపర్లు ప్రకటించాయి. 

Special Offers on Akshaya Tritiya from Reliance digital
Author
Hyderabad, First Published May 7, 2019, 11:21 AM IST

హైదరాబాద్: అక్షయ తృతీయ సందర్భంగా రిలయన్స్ డిజిటల్ తమ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కొనుగోలుదారులు 5 గ్రాముల బంగారం, 5 శాతం క్యాష్‌బ్యాక్‌ గెలుచుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

మంగళవారం అన్ని రిలయన్స్ డిజిటల్, మైజియో స్టోర్లతోపాటు అధికారిక వెబ్‌సైట్ www.reliancedigit al.inలో చేసే కొనుగోళ్లకు ఈ సదుపాయం వర్తిస్తుందని తెలిపింది. అంతేగాక సులభ వాయిదా పద్ధతుల్లో, తక్కువ ధరలకే నచ్చిన ఉత్పత్తులను సొంతం చేసుకోవచ్చని సోమవారం ఓ ప్రకటనలో రిలయన్స్ డిజిటల్ తెలిపింది. 

టెక్నాలజీ రంగంలో నిత్యం వస్తున్న అధునాతన మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగా అన్ని రకాల ఉత్పత్తులను రిలయన్స్ డిజిటల్ అందిస్తున్నది. దేశవ్యాప్తంగా 2000 స్టోర్లతో భారతీయ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రిటైలర్‌గా రిలయన్స్ డిజిటల్ వెలుగొందుతున్నది.

ఇంకా వరల్డ్‌ ఫేవరేట్‌ జ్యూయలర్‌ జోయాలుక్కాస్‌... పవిత్ర పసిడి కొనుగోళ్ల పర్వదినం సందర్భంగా గోల్డ్‌ఫార్ట్యూన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా బంగారం, డైమెండ్‌ జ్యూయలరీ కొనుగోలు దారులకు ఉచితంగా బంగారు నాణేలు బహూకరిస్తారు. సరికొత్త అక్షయ తృతీయ 2019 కలక్షన్‌ను ఆరంభించామని, కస్టమర్లకు సంపదతో సేవ చేయడానికి ఈ పండుగ తమకు అవకాశం కల్పిస్తోందని సంస్థ ఎండీ, చైర్మన్‌ జాయ్‌ అలూక్కాస్‌ పేర్కొన్నారు.  

మరోవైపు దేశంతో వేగంగా విస్తరిస్తున్న రిటైల్‌ చైన్స్‌లో ఒకటైన ఒర్రా, అక్షయ తృతీయ సందర్భంగా కస్టమర్లకు భారీ ఆఫర్లను ప్రకటించింది. డైమెండ్‌ జ్యూయలరీ కొనుగోలుపై 25 శాతం తగ్గింపు సదుపాయాన్ని కల్పిస్తోంది. 

పసిడి ఆభరణాల మేకింగ్‌ చార్జీలపై కూడా 25 శాతం రాయితీ ప్రకటించింది. గోల్డ్‌ నాణేలు, కడ్డీలపై అసలు మేకింగ్‌ చార్జీలు ఉండవు. డైమెండ్‌ జ్యూయలరీ కొనుగోలుకు సంబంధించి వడ్డీ రహిత ఇన్‌స్టాల్‌మెంట్‌ చెల్లింపు సౌలభ్యతను కల్పిస్తున్నట్లు ఒక ప్రకటన పేర్కొంది.  

ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్‌ గ్రూప్‌ ప్రత్యేక అక్షయ త్రుతీయ కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 7 గంటల నుంచే షోరూమ్‌లను ప్రారంభిస్తున్నట్లు మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 

వివిధ ఆఫర్లు, డిస్కౌంట్లు ఈ పండుగ సందర్భంగా అందుబాటులో ఉండనున్నాయి. పండుగను పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా దాదాపు 2000 కేజీల పసిడి విక్రయం అవుతుందని,  భావిస్తున్నట్లు మలబార్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఎంపీ అహ్మద్‌  పేర్కొన్నారు.

సంబంధిత వార్త చదవండి: అక్షయతృతీయ: ఎస్బీఐ కార్డుతో బంగారం కొంటే క్యాష్‌బ్యాక్

Follow Us:
Download App:
  • android
  • ios