మే 7న అక్షయ తృతీయ పర్వదినంను పురస్కరించుకుని నగల షాపులు, బ్యాంకులు, ఇతర ఇ కామర్స్ దిగ్గజాలు కూడా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు తమదైన ప్రయత్నాలను చేస్తున్నాయి.

అక్షయ తృతీయ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కూడా బంగారం కొనుగోళ్లపై ఆఫర్ ప్రకటించింది. రిలయన్స్ జువెల్స్, జోయాలుక్కాస్, జీఆర్‌టీ జువెల్లర్స్, కళ్యాణ్ జువెల్లర్స్ లాంటి ప్రముఖ నగల దుకాణాల్లో నగలు కొంటే రూ. 2,500 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. 

ఎంపిక చేసిన షాపుల్లో ఎస్బీఐ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తే 5శాతం వరకు ఈ క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అయితే, ఆఫర్ పొందాలనుకునేవారు ముందుగా నిబంధనలు తెలుసుకోవాలి. కనీస మొత్తం లేదా అంతకంటే ఎక్కువ చేస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. 

2019, జూన్ 25లోపు కార్డ్ ఖాతాలో క్యాష్‌బ్యాక్ క్రెడిట్ అవుతుంది. కాగా, ఎస్బీఐ కార్డులపై ఆఫర్లు ఉన్న షాపుల జాబితా తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి