ఏ‌టి‌ఎం వినియోగదారులకు మాగ్‌స్ట్రైప్ కార్డుల నుండి EMV చిప్, పిన్ ఆధారిత కార్డుకు మార్చుకోవాలని ఆర్‌బిఐ గత ఏడాది వివిధ బ్యాంకులకు ఆదేశించింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) తమ కస్టమర్లు పాత మాగ్ స్ట్రిప్" లేదా మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డు నుండి కొత్త EMV (యూరోపే, మాస్టర్ కార్డ్, మరియు వీసా) చిప్, పిన్ ఆధారిత  కార్డ్ కు మారాలని తెలిపింది.

also read ఉద్యోగులకు షాక్...ఈపీఎఫ్ఓ వాటాలో కోతపై కేంద్రం నజర్?

ఈ కొత్త కార్డ్ పొందడానికి డిసెంబర్ 31లోగా వారి హోం  బ్యాంకులో దరఖాస్తు  చేసుకోవాలి కొత్త కార్డ్ కోసం బ్యాంకు ఎలాంటి  ఛార్జీలు చేయకుండా  ఉచితంగా ఇస్తుంది."మాగ్‌స్ట్రిప్ కార్డులు(పాత ఏ‌టి‌ఎం కార్డ్) కలిగి ఉన్నవారు డిసెంబర్ 31 లోగా వారి హోం బ్రాంచ్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది" అని ఎస్‌బి‌ఐ ట్విట్టర్‌ ద్వారా ఒక పోస్ట్‌లో తెలిపింది.

ఎస్‌బిఐ కస్టమర్లు వాడుతున్న పాత మాగ్‌స్ట్రైప్ డెబిట్ కార్డులను  డిసెంబర్ 31 లోగా మార్చుకోకపోతే వారి ఏ‌టి‌ఎం కార్డ్ బ్యాంక్  డిఆక్టివేట్ చేయబడుతుంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గత ఏడాది వాణిజ్య బ్యాంకులకు తమ వినియోగదారులు మాగ్‌స్ట్రైప్ కార్డుల నుండి ఇఎంవి చిప్, పిన్ ఆధారిత కార్డుకి మారాలని ఆదేశించింది.

"ఆర్బిఐ మార్గదర్శకాల ప్రకారం, ఎస్బిఐ వినియోగదారుల అన్ని మాగ్నెటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులను EMV చిప్ & పిన్ ఆధారిత కార్డులోకి మార్చింది" అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విట్టర్లో తెలిపింది. మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డులను వాటి వాలిడిటీతో సంబంధం లేకుండా 31 డిసెంబర్ 2019  నుండి డిఆక్టివేట్ చేస్తున్నట్లు ఎస్బిఐ తెలిపింది.

also read సామాన్యుడే టార్గెట్.. జీఎస్టీ రేట్లకు రెక్కలు?

ఎవరైనా ఇంకా కొత్త  ఇఎంవి చిప్ కార్డులు అందుకోని ఎస్‌బిఐ కస్టమర్లు వెంటనే  హోమ్ బ్రాంచ్‌ను సంప్రదించి మాగ్‌స్ట్రైప్ కార్డును మార్చుకోవలని తెలిపింది.మాగ్‌స్ట్రిప్ డెబిట్ కార్డుల నుండి EMV చిప్ ఆధారిత డెబిట్ కార్డుకు మారాలని ఎస్‌బిఐ తన వినియోగదారులను ఇంతకు ముందు కూడా పదే పదే కోరింది.

"ఆన్‌లైన్ పేమెంట్ భద్రత కోసం అలాగే ఆన్‌లైన్ మోసాల నుండి మీ అక్కౌంట్ సంభందిత లావాదేవీలకు భద్రత కల్పించడానికి ఇది తప్పనిసరి" అని కొత్త EMV చిప్, పిన్ ఆధారిత కార్డుల గురించి ఎస్బిఐ తెలిపింది.