పునరుద్ధరించబడిన గోల్డ్ డిపాజిట్ స్కీం(ఆర్-జీడీఎస్) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఆఫర్ చేస్తోంది. ఇది గోల్డ్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీం. ఆర్-జీడీఎస్ కింద కస్టమర్లు తమ వద్ద అనవసరంగా పడివున్న బంగారానికి భద్రతతోపాటు వడ్డీ రూపంలో ఆదాయాన్ని పొందేందుకు ఈ డిపాజిట్ చేయవచ్చునని ఎస్బీఐ తన అధికారిక వెబ్‌సైట్ sbi.co.inలో పేర్కొంది.

(రెసిడెంట్ ఇండియన్స్)వ్యక్తిగత, ప్రొప్రైటర్‌షిప్, భాగస్వామ్య సంస్థలు, హెచ్‌యూఎఫ్(హిందూ ఉమ్మడి కుటుంబాలు), సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) కింద రిజిస్టర్ చేయబడిన మ్యూచువల్ ఫండ్స్, కంపెనీలు ఎస్బీఐ అందించే ఈ స్కీంలో పెట్టుబడి పెట్టేందుకు అర్హులే. గోల్డ్ బార్లు, కాయిన్స్, స్టోన్స్ లేని ఆభరణాలు, ఇతర మెటల్‌ను ఎవరైనా డిపాజిట్ చేయవచ్చునని ఎస్బీఐ పేర్కొంది.

పునరుద్ధరించబడిన గోల్డ్ డిపాజిట్ స్కీం(ఆర్-జీడీఎస్) వివరాలు:

1. పరిమాణం: కస్టమర్లు కనీసం 30గ్రాముల(గ్రాస్) బంగారాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి లేదు.

2. డిపాజిట్ రకాలు: ఈ పథకం కింద మూడు రకాలు డిపాజిట్లు ఉన్నాయి..

షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్(ఎస్‌టీబీడీ): ఒక సంవత్సరం నుంచి మూడేళ్ల వరకు కాలపరిమితి.

మీడియం టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్(ఎంటీజీడీ): 5 నుంచి 7ఏళ్ల కాలపరిమితి. కేంద్ర ప్రభుత్వం తరపున బ్యాంకు ఈ డిపాజిట్లను తీసుకుంటుంది. 

లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్(ఎల్‌టీజీడీ): దీని కాలపరిమితి 12 నుంచి 15ఏళ్లు. ఈ డిపాజిట్లు కేంద్ర ప్రభుత్వం తరపున బ్యాంకు తీసుకుంటుంది.

3. రేట్ ఆఫ్ ఇంటరెస్ట్, పేమెంట్:

ఎస్‌టీబీడీ: ఏడాదికి 0.50శాతం, రెండేళ్ల వరకు 0.55శాతం, మూడేళ్లకు 0.60శాతం.

ఎంటీజీడీ: 5-7ఏళ్లు, 2.25శాతం(ఏడాదికి)

ఎల్‌టీజీడీ: 12-15ఏళ్లు, 2.50శాతం(ఏడాదికి)

4. రీపేమెంట్:

ఎంటీజీడీ: మచూరిటీ తీరిన తర్వాత కస్టమర్లు ప్రిన్సిపాల్ మొత్తాన్ని బంగారం లేదా రూపాయల్లో పొందవచ్చు.

ఎంటీజీడీ, ఎల్‌టీజీడీ: బంగారం లేదా దానికి తగిన మొత్తం రూపాయల్లో తిరిగి చెల్లించడం జరుగుతుంది. 0.20శాతం బంగారం నిర్వహణ ఛార్జీల కింద బ్యాంకు వసూలు చేస్తుంది. 

5. ప్రీమేచుర్ పేమెంట్:

ఎస్‌టీబీడీ: మెచూరిటీ తీరకముందే పేమెంట్ పొందాలనుకుంటే ఏడాది తర్వాత ఇచ్చేస్తారు. వడ్డీరేటుపై పెనాల్టీని వసూలు చేస్తారు.

ఎంటీజీడీ: మూడేళ్ల తర్వాత ఎప్పుడైనా డిపాజిట్లను ఉపసంహరించుకోవచ్చు. వడ్డీపై పెనాల్టీ ఉంటుంది.

ఎల్‌టీజీడీ: ఐదేళ్ల తర్వాత తీసేసుకోవచ్చు. వడ్డీపై పెనాల్టీ ఉంటుంది. 

సంబంధిత వార్తలు: 

ఎస్బీఐ ఏటీఎం కార్డ్ విత్‌డ్రా లిమిట్, ఛార్జీలు మీకు తెలుసా? 

SBI ఎడ్యుకేషన్ లోన్ పొందడం ఎలా?