మార్చి 10 నుంచి రుణాలపై వడ్డీరేట్లను 15 బేసిస్ పాయింట్ల వరకు ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసిఎల్‌ఆర్) తగ్గించినట్లు దేశ అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) బుధవారం తెలిపింది.వివిధ కాలపరిమితితో కూడిన రుణాలపై నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రేటు (ఎంసీఎల్‌ఆర్‌)లో కోత విధించింది. 

బ్యాంక్ తన ఏడాది కాల  రుణాపై ఎంసిఎల్‌ఆర్‌ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.75 శాతానికి సవరించింది. అంతకు ముందు 7.85 శాతం ఉంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించడం  వరుసగా ఇది 10వ సారి.

also read విలాసవంతమైన బంగ్లాలు, వేల కోట్ల ప్రాపర్టీలు ఇవి రాణాకపూర్‌ ఆస్తులు...

ఓవర్‌నైట్‌, ఒక నెల కాలపరిమితి కలిగిన రుణ రేట‍్లను  ఎంసిఎల్‌ఆర్‌లను 15 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.45 శాతానికి తగ్గించారు. మూడు నెలల కాలపరిమితి కలిగిన రుణ రేట‍్లను ఎంసిఎల్‌ఆర్‌  7.65 శాతం నుంచి 7.50 శాతానికి సవరించారు.

మూడేళ్ల కాలానికి రుణ రేట్లను 8.05 శాతం నుంచి 7.95 శాతానికి కుదించింది. రెండేళ్ల, మూడేళ్ల కాలానికి రుణ రేట్లను వరుసగా 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.95 శాతానికి చేసింది, ఇంతకు ముందు 8.05 శాతం ఉంది.

also read గుడ్ న్యూస్... తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..లీటర్ పెట్రోల్‌కు..

సోమవారం, మరో ప్రభుత్వ రుణదాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఎంసిఎల్‌ఆర్‌ను మార్చి 11 నుంచి అన్ని రుణాలపై వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు ప్రకటించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించడం ఇది వరుసగా పదోసారి కావడం గమనార్హం. 2019 జూలై నుండి ముంబైకి చెందిన బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించడం వరుసగా ఇది తొమ్మిదవ సారి అని ప్రకటించింది.