Asianet News TeluguAsianet News Telugu

విలాసవంతమైన బంగ్లాలు, వేల కోట్ల ప్రాపర్టీలు ఇవి రాణాకపూర్‌ ఆస్తులు...

రాణాకపూర్‌ ఎస్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు. భారతదేశంలో ఉన్న తన ఆస్తులను అమ్మేసి ఇతర దేశానికి పారిపోడానికి ప్రయత్నిస్తుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) రానా కపూర్‌ను అదుపులోకి తీసుకుంది.

rana kapoor's properties worth over 1000 crores in delhi and mumbai
Author
Hyderabad, First Published Mar 11, 2020, 2:18 PM IST

యెస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు  రాణాకపూర్‌ ఎస్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు. భారతదేశంలో ఉన్న తన ఆస్తులను అమ్మేసి ఇతర దేశానికి పారిపోడానికి ప్రయత్నిస్తుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) రానా కపూర్‌ను అదుపులోకి తీసుకుంది. సుమారు1000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను  రాణాకపూర్‌ విక్రయించడానికి ప్లాన్ చేసినట్టు  ఇడి అధికారులు తెలిపారు

ఢిల్లీలోని అమృత షెర్గిల్ మార్గ్  40, అమృత షెర్గిల్ మార్గ్, చాణక్య పూరిలోని 18 కౌటిల్య మార్గ్, సర్దార్ పటేల్ మార్గ్‌లోని డిప్లొమాటిక్ ఎన్‌క్లేవ్ లలో ఉన్న విలాసవంతమైన బంగ్లాలు తన భార్య బిందూకపూర్ పేరు మీద ఉన్నట్టు అధికారులు తెలిపారు.

also read  ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చేమటలు పట్టిస్తున్న కరోనా వైరస్...కారణం ?

అయితే ఈ ఆస్తులను కొంతమంది అగ్రశ్రేణి  డీలర్లకు అమ్మెందుకు మాజీ యెస్ బ్యాంక్ చీఫ్ అప్పగించారని ఈడీ అధికారుల విచారణలో తేలింది. బిందూకపూర్ జరిపిన రూ.4,300 కోట్ల ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు సాగిస్తోంది

ఢిల్లీలోని ప్రధాన ప్రాంతమైన అమృత షెర్గిల్ మార్గ్ 40 బిందు కపూర్ అబోడ్ లిమిటెడ్ పేరిట కొనుగోలు చేసింది, మిగిలిన రెండు ఆస్తులు బ్లిస్ విల్లా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందినవి అని తెలిసింది.

విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడ్డ రానా కపూర్, తనపై ఇడి దర్యాప్తు గురించి తెలిసిన వెంటనే ఢిల్లీ, ముంబైలలో ఉన్న తన ఆస్తులను అమ్మేసి  యుఎస్, యుకె లేదా ఫ్రాన్స్‌కు పోయెందుకు ప్లాన్ వేసినట్టు ఈడీ అధికారుల తెలిపారు.

దేశం విడిచి వెళ్ళే ముందు భారతదేశంలో ఉన్న ఏ  ఒక్క ఆస్తిని  కూడా వదలకుండ వాటిని  అమ్మేసి ఆ డబ్బుతో పారిపోవడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. బ్లిస్ అబోడ్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబైకి చెందిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ నుండి రూ .380 కోట్లు తీసుకొని ఈ ఆస్తిని కొనుగోలు చేసింది.  

 
అమృత షెర్గిల్ మార్గ్ ఢిల్లీలోని అత్యంత ప్రధాన ప్రాంతాలలో ఒకటి. అమృత షెర్గిల్ మార్గ్ ధర సుమారు 450 కోట్ల రూపాయలు అని విచారణలో తేలింది. సర్దార్ పటేల్ మార్గ్‌లోని డిప్లొమాటిక్ ఎన్‌క్లేవ్‌ రానా కపూర్‌కు ఉన్న ఒక ప్రధాన ఆస్తి, అయితే దాని గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

also read గుడ్ న్యూస్... తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..లీటర్ పెట్రోల్‌కు..

 ఢిల్లీ చాణక్యపురిలో భవనం విలువ రూ.350 కోట్లు, సర్దార్ పటేల్ భవనం విలువ రూ.250 కోట్లని ఈడీ నిర్ణయించింది. ఈ మూడు ఆస్తులపై ఇడి  దర్యాప్తును ప్రారంభించడమే కాక, ముంబైలోని ఆల్టమౌంట్ రోడ్‌లోని మరో ఆస్తిని కపూర్ కుటుంబం 2018 లో రూ .128 కోట్లకు కొనుగోలు చేసినట్లు తేలింది.

సిటీ బ్యాంక్, గ్లాక్సో స్మిత్‌క్లైన్ యాజమాన్యంలో ఉన్న ఈ ఆస్తి ముఖేష్ అంబానీ 27-అంతస్తుల భవనం పక్కన ఉంది. రానా కపూర్, అతని భార్య, తన ముగ్గురు కుమార్తెలు - రాఖీ కపూర్ టాండన్, రోష్ని కపూర్, రాధా కపూర్, దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డిహెచ్ఎఫ్ఎల్) ప్రమోటర్ కపిల్ వాధ్వాన్లపై ఇడి ఇంకా సిబిఐ వేర్వేరు కేసులను నమోదు చేశాయి. 


ముంబైలో దాదాపు 16 గంటల పాటు ప్రశ్నించిన తరువాత రానా కపూర్‌ను ఆదివారం ఇడి అరెస్టు చేసింది. మార్చి 11 వరకు ముంబై కోర్టు అతన్ని రిమాండ్‌కు తరలించింది.

Follow Us:
Download App:
  • android
  • ios