బీజింగ్: రెండేళ్లుగా చైనా- అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి ఇటీవలే రెండు దేశాల మధ్య కుదిరిన తొలి దశ వాణిజ్య ఒప్పందంతో తెర పడింది. దీనికి మరో లంకె కూడా ముడి పడి ఉంది. చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం.. అడ్వాన్స్‌గా 5జీ టెక్నాలజీ రూపకల్పనలో ముందంజలో ఉన్న హువావే అధినేత రెన్ ఝెంగ్ ఫీ కూతురు, సంస్థ చీఫ్ ఫైనాన్సియల్ అధికారి మెంగ్ వాంగ్ జూ స్వదేశానికి వస్తారా? లేదా? అన్న సంగతి సోమవారం తేలనున్నది. 

also read నిలిచిన వాట్సాప్‌ సేవలు: కొద్దిసేపు కాలు చేయ్యి ఆడలేదంటే నమ్మండి

అమెరికా అభ్యర్థన మేరకు 2018 చివరిలో కెనడా ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం వాంకోవర్‌లో హౌస్ అరెస్ట్ చేయబడిన మెంగ్ వాంగ్ జూను తమకు అప్పగించాలని అమెరికా దాఖలు చేసిన పిటిషన్ సోమవారం కెనడా కోర్టులో విచారణకు రానున్నది. 

ఇరాన్‌పై విధించిన ఆంక్షలను మెంగ్ వాంగ్ జూ నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ కెనడా ఆమెను అరెస్ట్ చేసింది. కానీ తానేమీ తప్పేమీ చేయలేదని మెంగ్ వాంగ్ జూ వాదిస్తోంది. ప్రస్తుతం వాంకోవర్‌లోని ఒక గెస్ట్ హౌస్‌లో హౌస్ అరెస్ట్ చేశారు. మెంగ్ వాంగ్ జూను అరెస్ట్ చేయడంతో చైనా ఆశ్చర్యానికి గురైంది. తప్పుడు ఆరోపణలతో మెంగ్ వాంగ్ జూను అరెస్ట్ చేశారని, ఆమెను విడుదల చేయాలని కెనడా ప్రభుత్వాన్ని చైనా కోరింది. 

మెంగ్ వాంగ్ జూను అరెస్ట్ చేసినందుకు ప్రతిగా చైనా కూడా ఇద్దరు కెనడా పౌరులు - మాజీ దౌత్యవేత్త మిచైల్ కోవ్రింగ్, పారిశ్రామికవేత్త మిచైల్ స్పావోర్ లను అరెస్ట్ చేసింది. వారు తమ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించారని చైనా ఆరోపిస్తోంది. కొన్ని కెనడా ఉత్పత్తులపై చైనా నిషేధం కూడా విధించింది. హువావే ఉత్పత్తులపై అమెరికా, దాని మిత్ర దేశాలు నిషేధం విధించినా గతేడాది టర్నోవర్ 121 బిలియన్ డాలర్లకు పెరగడం గమనార్హం. 

also read ఆన్‌లైన్ ఆఫర్ల సునామీ: ఫ్లిప్ కార్ట్ వర్సెస్ అమెజాన్ ఒకేసారి

అంతర్జాతీయ సంబంధాలు, మెంగ్ వాంగ్ ఝూకు స్వేచ్ఛ కల్పించాలని, దేశ సార్వభౌమత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మెంగ్ వాంగ్ ఝూను అప్పగించాలని డిమాండ్ చేస్తున్న అమెరికా కూడా పద్దతులు, అంతర్జాతీయ సూత్రాలు పాటించాలని సూచిస్తున్నారు. తమ క్లయింట్ కెనడాలో ఎటువంటి తప్పు చేయలేదని చైనా వాదిస్తోంది. అమెరికా అప్పగింత డిమాండ్ సరి కాదన్నారు. 

అయితే చైనా తన ఆర్థిక, వాణిజ్య రంగాల్లో సంస్థాగత సంస్కరణలు చేపట్టడానికి కూడా అంగీకరించింది. అయితే తమ క్లయింట్ మెంగ్ వాంగ్ జూపై కేసు రాజకీయ ప్రేరేపితం అని ఆమె తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు.