శామ్సంగ్ చైర్మన్ కి జైలు శిక్ష... కారణం..?
కార్మిక సంఘం చట్టాలను ఉల్లంఘించినందుకు సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు శామ్సంగ్ ఛైర్మన్ లీ సాంగ్-హూన్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కాంగ్ క్యుంగ్-హూలను దోషులుగా నిర్ధారించింది.
సియోల్: ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్‌ఫోన్, చిప్ తయారీ సంస్థ శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ఛైర్మన్ లీ సాంగ్-హూన్ యూనియన్ కార్యకలాపాలను దెబ్బతీసినందుకు కోర్టు జైలు శిక్ష విధించింది. తరువాత ఈ సంస్థ బుధవారం రోజున క్షమాపణలు కోరింది.
శామ్సంగ్ కస్టమర్ సర్వీస్ యూనిట్‌లోని సిబ్బందిని యూనియన్ ఆపరేట్ చేయకుండా అరికట్టడానికి విస్తృత కార్యకలాపాలకు నాయకత్వం వహించినందుకు చైర్మన్ లీ సాంగ్-హూన్ అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కాంగ్ క్యుంగ్-హూన్ ఇద్దరికీ 18 నెలల జైలు శిక్షను కోర్ట్ విధించింది.
శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ శామ్సంగ్ గ్రూప్ కు ప్రధాన అనుబంధ సంస్థ, ఇది ప్రపంచంలోని 11 వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దక్షిణ కొరియా ఎదగడానికి దారితీసింది.కార్మిక సంఘం చట్టాలను ఉల్లంఘించినందుకు లీ సాంగ్-హూన్, కాంగ్ క్యుంగ్-హూను మంగళవారం సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు దోషులుగా తేల్చింది. యూనియన్ సభ్యుల జీతలను తగ్గించాలని ఇంకా వారి అప్పులు, వారి వ్యక్తిగత జీవితాల వివరాలను తెలుసుకోవాలీ అని సబార్డినేట్లను ఆదేశించినట్లు ప్రాసిక్యూటర్లు చెప్పారు.
also read హైదరాబాద్‌లో కొత్త స్కూటర్ రెంట్ సర్విస్...1.కి.మీ రూపాయి...
ఈ కేసు విచారణ సమయంలో ఇద్దరూ బెయిల్‌పై ఉన్నారు, కాని కోర్ట్ తిర్పు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు.2013లో, లీ సాంగ్-హూన్ శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఉన్నాడు, ఇద్దరూ ఇప్పుడు బ్యాన్ చేసిన ఫ్యూచర్ స్ట్రాటజీ ఆఫీసులో సభ్యులుగా ఉన్నారు.
నిర్మాణ అనుబంధ సంస్థ శామ్‌సంగ్ సి అండ్ టితో కంపెనీ బుధవారం జాయింట్ ప్రకటన విడుదల చేసింది. యూనియన్ చట్టాలను ఉల్లంఘించినందుకు ఎగ్జిక్యూటివ్‌లు కూడా దోషులుగా ఉన్నారు అందుకు వారు వారి తప్పులను కూడా అంగీకరించారని తెలిపింది.
"గతంలో కార్మిక సంఘాల పట్ల కంపెనీల అవగాహన అంచనాలకు తగ్గట్టుగా ఉందని మేము అంగీకరిస్తున్నాము" అని వారు చెప్పారు.లీ సాంగ్-హూన్ తనపై ఆరోపణలను ఖండించారు, కాని శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ లీ సాంగ్-హూన్ పై వచ్చిన ఆరోపణలపై స్పందించడానికి నిరాకరించింది.
1987 లో మరణించిన శామ్సంగ్ గ్రూప్ వ్యవస్థాపకుడు లీ బైంగ్-చుల్ యూనియన్లను వ్యతిరేకించడమే కాదు వారిని ఎప్పటికీ అనుమతించనని కూడా చెప్పాడు.దక్షిణ కొరియాలో కూడా యూనియన్లను గుర్తించడానికి శామ్సంగ్ చాలా కాలం పాటు నిరాకరించినట్లు ఈ తీర్పులో తేలిందని నార్వేలోని ఓస్లో విశ్వవిద్యాలయంలో కొరియన్ స్టడీస్ ప్రొఫెసర్ వ్లాదిమిర్ టిఖోనోవ్ అన్నారు.
also read జొమాటో కొత్త ఆఫర్.. లేటైతే పుడ్ ఫ్రీ!
ఆసియాలోని నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దక్షిణ కొరియా ఎదగడంలో శామ్సంగ్ కీలక పాత్ర పోషించింది. వైస్ చైర్మన్ లీ జే-యోంగ్ లంచం అలాగే అధ్యక్షుడు పార్క్ జియున్-హేను ఒత్తిడికి గురిచేసి అవినీతి కుంభకోణానికి సంబంధించి జైలు శిక్షను కూడా అనుభవించారు. సియోల్‌లో బుధవారం శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ షేర్లు 0.71 శాతం క్షీణించాయి.
శామ్సంగ్ సెమీకండక్టర్, డిస్ ప్లే ఫ్యాక్టరీలలో ఉద్యోగం పొందిన తరువాత కొన్ని సంవత్సరాలుగా 240 మంది పనికి సంబంధించి క్యాన్సర్, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నారని కార్మికులలో ఒకరు అన్నారు, వారిలో 80 మంది మరణించగా అందులో చాలామంది యువతులే ఉండటం గమనార్హం. ఒక బాధితుడి తండ్రి హ్వాంగ్ సాంగ్-కి మాట్లాడుతూ"శామ్సంగ్ లో యూనియన్లు లేనందున నా కుమార్తె మరణించింది."అని తెలిపాడు.