ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి నష్టలతో ప్రారంభమైంది. డారలు పుంచుకోవడంతో సోమవారం రూపాయి 47 పైసలు క్షీణించి 69.82 వద్ద ట్రేడింగ్ ఆరంభించింది. గురువారం 25పైసలు ఎగిసిన రూపాయి.. 69.35 వద్ద ముగిసింది. 

అదేసమయంలో బీఎస్ఈ మెంచ్ మార్క్ ఇండెక్స్ 309.56 పాయింట్లు లేదా 38,830.72 వద్ద 0.79శాతం తక్కువగా ఉంది. నిఫ్టీ కూడా 101.80 పాయింట్లు లేదా 0.87శాతం ఉంది.

మరో వైపు అంతర్జాతీయ క్రూడ్ ధరలు 2.5శాతం పెరిగాయి. బ్యారెల్ చమురు ధర 73.77 డాలర్ల వద్ద 5 నెలల గరిష్టాన్ని నమోదు చేసింది.