రిలయన్స్ జ్యుయెల్స్ ప్రధాన స్టోర్ ప్రారంభం
గుంటూరులో రిలయన్స్ జ్యుయెల్స్ ప్రధాన స్టోర్ ప్రారంభం,వినియోగదారులకు అందుబాటులో ‘అతుల్యా’ కలెక్షన్ ఆభరణాలు, బంగారు, వజ్రాభరణాల కొనుగోలుపై ఆకర్షణీయమైన ప్రారంభ ఆఫర్లు
గుంటూరు: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల బ్రాండ్‌లలో ఒకటైన రిలయన్స్ జ్యుయెల్స్, గుంటూరులోని బ్రాడిపేటలో తన నూతన ప్రధాన స్టోర్‌ను నేడు ఆవిష్కరించింది. పండుగ షాపింగ్ ఉత్సాహాన్ని మరింత పెంచేలా ఈ షోరూం అందుబాటులోకి రావడమే కాకుండా నగరం మరియు పరిసర ప్రాంతాల్లో అత్యుత్తమ ఆభరణాల కేంద్రంగా నిలవనుంది.
హ్యాండీక్రాఫ్ట్ కలెక్షన్లలో భాగంగా సంస్థకు చెందిన సొంత బ్రాండ్ అయిన `అతుల్యా`ను ఈ పండుగను పురస్కరించుకొని రిలయన్స్ జ్యుయెల్స్ ఆవిష్కరించింది. ఈ కలెక్షన్లలో భాగంగా, పురాతన మరియు సంప్రదాయ డిజైన్లతో 22 క్యారెట్ల బంగారంతో కూడిన నెక్లెస్ మరియు 18 క్యారెట్ల బంగారు మరియు వజ్రాల ఆభరణాలు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
మెడలో వేసుకునే ఆకర్షణీయమైన గొలుసు (చోకర్) మరియు చిన్న, పెద్ద శ్రేణిలోని నెక్లెస్‌లు ఈ పండుగ సీజన్‌ను మరింత ద్విగుణీకృతం చేసేలా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.సంస్కృతిలో ఉత్కృష్టం, నిర్మాణ అంశాల్లో అద్భుతమైన మరియు విభిన్నతకు పెట్టింది పేరయిన రాజస్థాన్ రాష్ట్ర ప్రత్యేకతలు `అతుల్యా` డిజైన్‌కు స్ఫూర్తిగా నిలిచాయి.
also read బీఎస్ఎన్ఎల్... ఉద్యోగులకు మంచి రోజులు...
రాజస్థాన్‌లోని రాజభవనాలు మరియు బ్లాక్ ప్రింటింగ్ విశిష్టతలను `అతుల్యా` కలెక్షన్‌లోని ప్రతి అంశంలో భాగంగా చేశారు. అతుల్యా కలెక్షన్‌లో భాగంగా రంగుల స్టోన్లు మరియు కుందన్ వర్క్‌లో రాజస్థాన్ యొక్క డిజైన్ నైపుణ్యం మరియు ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన విధానం, విశిష్టత మరియు రాజవంశీయుల ఆహార్యాలు కొట్టొచ్చినట్లు ఈ ఆభరణాలను తీర్చిదిద్దారు. భారతీయ సంస్కృతికి స్పష్టంగా అద్దంపట్టేలా ప్రతి ఆభరణాన్ని రూపొందించారు.
ప్రతి ఒక్క దుస్తులకు నప్పే విధంగా వాటిని పొందుపర్చారు. అనువంశిక సంస్కృతి యొక్క వైభవాన్ని, విశిష్టతను రాబోయే తరాలకు చాటిచెప్పే విధంగా వైవిధ్యభరితంగా అతుల్యా కలెక్షన్లు తీర్చిదిద్దారు. పెద్ద ఎత్తున విస్తరణ ప్రణాళికలతో ముందుకు సాగుతున్న రిలయన్స్ జ్యుయెల్స్ తన వినియోగదారులకు విస్తృత శ్రేణిలో ఆభరణాలు అందించడమే కాకుండా వాటికి సంబంధించిన పూర్తి సేవలను అందించనుంది.
కొత్త షోరూంలో అందుబాటులో ఉండే అధునాతన టెక్నాలజీ సహాయంతో వినియోగదారులకు ఉత్తమ సేవలను అందించడం వల్ల సమగ్ర షాపింగ్ అనుభూతిని కలిగిస్తుంది. ఈ షోరూంలో ప్రత్యేకమైన మరియు విస్తృత శ్రేణికి చెందిన బంగారం, వజ్రాలు మరియు ఈ రెండింటి సమ్మిళితమైన ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రిలయన్స్ జ్యుయెల్స్ షాప్ ఇన్ షాప్ (ఎస్ఐఎస్) విభాగంలోని వాటిని కలుపుకొని 99 నగరాల్లో 200కు పైగా స్టోర్లతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తోంది.
also read డీహెచ్‌ఎఫ్‌ఎల్ ..అక్రమాలు...తవ్వేకొద్దీ బయట పడుతున్నాయి
కొత్త షోరూం అందుబాటులోకి తెచ్చిన సందర్భంగా తన సంతోషాన్ని రిలయన్స్ జ్యుయెల్స్ యొక్క ప్రతినిధి ఈ సందర్భంగా పంచుకుంటూ...``గుంటూరులో మా ప్రతిష్టాత్మక షోరూం ప్రారంభించుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. ఆభరణాల షాపింగ్ అనుభూతిని సమగ్రంగా మార్చివేసేందుకు మేం కృషిచేస్తున్నాం. విస్తృత శ్రేణిలో ఆభరణాలు, ధరలు, స్వచ్ఛత మరియు నాణ్యతకు భరోసా కల్పించడం వంటి వాటిల్లో నూతన ప్రమాణాలను సృష్టించి మా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించనున్నాం`` అని వెల్లడించారు.
షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లను అందుబాటులో ఉంచారు. బంగారు ఆభరణాల తయారీపై 25%* తగ్గింపు, వజ్రాల ఆభరణాలపై 25% వరకూ ఆఫ్ మరియు మొదటి వందమంది వినియోగదారులకు ఉచిత బంగారు నాణెం* అందించనున్నారు. దీంతోపాటుగా బంగారు మరియు వజ్రాల ఆభరణాల తయారీపై 5% వరకూ తగ్గింపు (రూ.5 లక్షలకు పైబడి కొనుగోలు చేసిన వారికి) అవకాశం కల్పించారు.
అక్టోబర్ 23వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. (* షరతులు వర్తిస్తాయి.)దీంతోపాటుగా వినియోగదారులు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్/డెబిట్ కార్డులపై వినియోగదారులు 10% క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు.(షరతులు వర్తిస్తాయి.)