ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా తన చిన్ననాటి  సంగతులను  ఒక ఇంటర్వ్యూ  ద్వారా చెబుతూ "లాస్ ఏంజిల్స్‌లో కాలేజీ గ్రాడ్యుయేట్‌గా ఉన్నపుడు దాదాపు వివాహం అయిపోయింది అనే భవన ఉండేది అని వెల్లడించారు.
 

ప్రముఖ ఫేస్‌బుక్ పేజీ 'హ్యూమన్స్ ఆఫ్ బొంబాయి'తో రతన్ టాటా మాట్లాడుతూ తన తల్లిదండ్రుల విడాకుల తరువాత వల్ల అమ్మమ్మతో పెరగడం, ఆమె అతనికి నేర్పించిన విలువలు ఇంకా  కార్నెల్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడం, అక్కడే ప్రేమలో పడటం చివరికి వేరుగా విడిపోవడం జరిగింది.

 82 ఏళ్ల మిస్టర్ టాటా తల్లిదండ్రుల విడాకుల కారణంగా అతను, అతని సోదరుడు  ర్యాగింగ్ ను ఎదుర్కొన్న తనకు సంతోషకరమైన బాల్యం ఉందని చెప్పారు. రతన్ టాటా తల్లిదండ్రులు నావల్ టాటా, సూని టాటా అతను 10 సంవత్సరాల వయసులో ఉండగా విడాకులు తీసుకున్నాడు. అతన్ని అమ్మమ్మ నవజ్ బాయి రతన్   టాటాని పెంచింది.

also read ఆ ఇంటి కోసం ఏకంగా రూ.1150 కోట్లు వెచ్చించాడు....

నిన్న రాత్రి ఆన్‌లైన్‌లో ఫేస్‌బుక్ లో చేసిన పోస్ట్‌  వైరల్ అయ్యింది ఇప్పుడు. టాటా సన్స్ చైర్మన్ ఎమెరిటస్ వల్ల అమ్మమ్మ నేర్పించిన విలువల గురించి మాట్లాడారు."నాకు ఇప్పటికీ గుర్తుంది ఆమె నా సోదరుడుని, నన్ను వేసవి సెలవులకు లండన్కు తీసుకువెళ్ళింది. అక్కడికి వెళ్లిన తర్వాత ఎలా ఉండాలో ముఖ్యంగా డిగ్నిటీ గురించి నేర్పించింది. ఆ విషయాలన్నీ మా మెదళ్లలో ముద్రపడిపోయాయి. 

అతను తన తండ్రితో ఉన్న విభేదాల గురించి కూడా చెప్పాడు. "నేను వయోలిన్  నేర్చుకోవాలనుకున్నాను, కానీ నాన్న పియానో నేర్చుకోవాలని పట్టుబట్టారు.నేను యుఎస్ లోని కాలేజీకి వెళ్లాలని అనుకున్నాను, మా నాన్న యు.కె. వెళ్లాలని పట్టుబట్టాడు. నేను ఆర్కిటెక్ట్ అవ్వాలనుకున్నాను కానీ నాన్న నన్ను ఇంజనీర్ కావాలని పట్టుబట్టాడు, "అని ఆయన వెల్లడించారు.

రతన్ టాటా చివరికి యు.ఎస్. లోని కార్నెల్ విశ్వవిద్యాలయంలో చదివాడు ఇందుకు వల్ల అమ్మమ్మకు కృతజ్ఞతలు తెలిపాడు. ఆర్కిటెక్చర్ డిగ్రీ పొందక  రతన్ టాటా లాస్ ఏంజిల్స్‌లో ఉద్యోగంలో చేరాడు అక్కడ అతను రెండు సంవత్సరాల పాటు  పనిచేశాడు.

also read చుక్కలు చూపిస్తున్నా నిత్యావసర ధరలు... 6ఏళ్ల గరిష్టానికి...

అక్కడ ఉన్నది కొంతకాలమే గానీ.. అక్కడి వాతావరణం ఎంతో అందమైనది. నా సొంత కారు, నేను ఇష్టంగా చేసే జాబ్‌ అని ఆయన గుర్తు చేశారు. నేను ప్రేమలో పడింది కూడా అక్కడే. ఓ అమ్మాయిని ప్రేమించాను దాదాపుగా మా పెళ్లి అయిపోయినట్లే అనే భావన. ఏదేమైనా మా అమ్మమ్మ ఆరోగ్యం బాగాలేకపోవడంతో అప్పుడే నేను ఇండియాకు రావాల్సి వచ్చింది.

అప్పటికే ఏడేళ్లుగా బామ్మ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. తనను చూడటానికి.. తనతో ఉండటానికి ఇక్కడికి వచ్చేశాను.నేను ప్రేమించిన అమ్మాయి కూడా నాతో పాటు భారతదేశానికి వస్తుందని అనుకున్నాను."కానీ 1962లో ఇండో-చైనా యుద్ధం కారణంగా ఆమె తల్లిదండ్రులు ఆమెని పంపించడానికి ఒప్పుకోలేదు. దీంతో మా సంబంధం విచ్ఛిన్నమైంది" అని రతన్ టాటా చెప్పారు.

ఆన్‌లైన్‌లో ఈ పోస్ట్ 21,000 కంటే ఎక్కువ లైక్స్, 2,000 'షేర్లతో' వందలాది మంది కామెంట్స్ కూడా చేయడంతో వైరల్ అయ్యింది.