అమెజాన్.కామ్ ఇంక్ వ్యవస్థాపకుడు,  ఈకామర్స్‌ దిగ్గజం జెఫ్ బెజోస్  తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బెవర్లీ హిల్స్ భవనం కోసం 165 మిలియన్ డాలర్లు చెల్లించాడు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడయిన జెఫ్‌ బెజోస్‌ బెవర్లీ హిల్స్‌లో అత్యంత విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు.

లాస్ ఏంజిల్స్-ఏరియాలోని ఇంటి కోసం ఇంత వెచ్చించి రికార్డు సృష్టించాడు అని కొందరు ఈ విషయం గురించి తెలిసిన వారు అంటున్నారు.  లాస్‌ఏంజెల్స్‌ ప్రాంతంలో ఓ ఇంటిపై ఇంత ధర పలకడం ఇదే రికార్డని వెల్లడించారు.  

also read  చుక్కలు చూపిస్తున్నా నిత్యావసర ధరలు... 6ఏళ్ల గరిష్టానికి...


 1930ల్లో హాలీవుడ్ ఫిల్మ్ టైటాన్ జాక్ వార్నర్ కోసం రూపొందించిన ఈ ప్రాపర్టీని ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ 1992 లో "ఆర్కిటిపాల్ స్టూడియో మొగల్ ఎస్టేట్"గా అభివర్ణించింది. ఈ భవనంలో జార్జియన్ శైలిలో విస్తారమైన టెర్రేస్‌లతో పాటు భారీ గోల్ప్‌ కోర్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.


రెగ్యులేటరీ ఫైలింగ్స్ జెఫ్  బెజోస్ 4.1 బిలియన్ అమెజాన్ షేర్లను నగదు రూపంలోకి మార్చిన  క్రమంలో ఆయన విపరీతంగా షాపింగ్‌పై వెచ్చిస్తున్న వార్తలు వెలువడటం గమనార్హం. అతను నవంబర్లో ఆర్ట్‌ మార్కెట్‌లోకూ ఎంటరైన జెఫ్‌ బెజోస్‌ ఆర్టిస్ట్‌ ఎడ్‌ రుసా వర్క్‌ను క్రిస్టీ ఆక్షన్‌లో హర్టింగ్‌ ది వర్డ్‌ రేడియో కోసం 52.5 మిలియన్‌ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు.

కెర్రీ జేమ్స్‌ మార్షల్‌ విగ్నెట్‌ 19ను ఏకంగా 18.5 మిలియన్‌ డాలర్లతో సొంతం చేసుకున్నారు. 56 ఏళ్ల  జెఫ్ బెజోస్ మాకెంజీ బెజోస్ తో 2019 లో విడాకులు తెసుకున్నాడు. అనంతరం గర్ల్‌ఫ్రెండ్‌ లౌరెన్‌ సాంచెజ్‌తో విలాసవంతంగా గడుపుతున్న ఫోటోలు సోషల్‌ మీడియాలోనూ హల్‌చల్‌ చేస్తున్నాయి.

also read వాలంటైన్స్ డే ఆఫర్...తక్కువ ధరకే ఫ్లయిట్ టికెట్లు...

 మీడియా మొగల్ రూపెర్ట్ ముర్డోచ్ కుమారుడు లాచ్లాన్ ముర్డోచ్ బెల్-ఎయిర్ ఎస్టేట్ కోసం సుమారు  150 మిలియన్లు చెల్లించి రికార్డుకుఎక్కడు. ఇంగ్లిష్ ప్రతీక ప్రచురితమైన కథనం ప్రకారం జెఫ్‌ బెజోస్‌ ఎంచుకున్న వార్నర్‌ ఎస్టేట్‌ 1990 నుంచి డేవిడ్‌ జెఫెన్‌ ఆధీనంలో ఉందని, దీన్ని ఆయన రూ. 280 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.  

గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి కొత్త జీవితాన్ని ఆస్వాదించేందుకే ఆయన భారీ కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు.  కెర్రీ జేమ్స్‌ మార్షల్‌ విగ్నెట్‌ 19ను ఏకంగా 18.5 మిలియన్‌ డాలర్లతో సొంతం చేసుకున్నారు. ఇక బెజోస్‌కు ఇప్పటికే వాష్టింగ్టన్‌ డీసీ వంటి అమెరికన్‌ తీర ప్రాంతాల్లో విలాసవంతమైన భవనాలున్నాయి.