Asianet News TeluguAsianet News Telugu

బజాజ్ ఆటో చైర్మన్ రాహుల్ బజాజ్ రాజీనామా.. అతని స్థానంలో నీజర్ బజాజ్ కి కంపెనీ పగ్గాలు..

బజాజ్ ఆటో చైర్మన్ రాహుల్ బజాజ్ రాజీనామా చేశారు. అతని స్థానంలో నీరజ్ బజాజ్ కంపెనీ పగ్గాలు చేపట్టనున్నారు. ఆయనకు ఈ పరిశ్రమలో 35 సంవత్సరాల అనుభవం ఉంది.  

rahul bajaj resigns from the post of chairman of bajaj auto neeraj bajaj will replace him
Author
Hyderabad, First Published Apr 30, 2021, 3:57 PM IST

దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ బజాజ్ ఆటో చైర్మన్ రాహుల్ బజాజ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు అతని స్థానంలో నీరజ్ బజాజ్ సంస్థ పగ్గాలు చేపట్టనున్నారు. నీజర్ బజాజ్ ప్రస్తుతం కంపెనీలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

రాహుల్ బజాజ్ 2021 ఏప్రిల్ 30 నుండి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ బజాజ్ ఆటో చైర్మన్ పదవి నుంచి వైదొలగనున్నారు. గురువారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో కంపెనీ ఈ సమాచారాన్ని ఇచ్చింది.  నీరజ్ బజాజ్ రాహుల్ బజాజ్ బంధువు. ఆయనకు ఆటోమొబైల్ పరిశ్రమలో 35 సంవత్సరాల అనుభవం ఉంది. అతను సెప్టెంబర్ 2006లో బజాజ్ ఆటోలో చేరాడు. 

రాహుల్ బజాజ్ ఎందుకు ఈ పదవిని వదులుకొనున్నారు
కంపెనీ ప్రకటన ప్రకారం 82 ఏళ్ల రాహుల్ బజాజ్ తన వయస్సును పేర్కొంటూ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.  రాహుల్ బజాజ్ 1972 నుండి బజాజ్ ఆటో అండ్ బజాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలతో గత ఐదు దశాబ్దాలుగా సంబంధం కలిగి ఉన్నారు. తన రాజీనామా నిర్ణయాన్ని బోర్డు ఆమోదించిన తరువాత, అతను  సంస్థలో సలహాదారుడి పాత్రలో కొనసాగుతారు. రాహుల్ బజాజ్ మొత్తం ఆస్తులు 6.5 బిలియన్ డాలర్లు (సుమారు 48 కోట్లకు పైమాటే). 

also read భారతదేశానికి వ్యతిరేకంగా బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు.. కరోనా వాక్సిన్ ఫార్ములా పంచుకోవద్దు అంటు.. ...

అతని పాత్ర ఏమిటి
గత ఐదు దశాబ్దాలలో బజాజ్ గ్రూప్  విజయానికి రాహుల్ బజాజ్ ఎంతో కృషి చేశారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అతని అనుభవం, పాత్రను బట్టి డైరెక్టర్ల బోర్డు రాహుల్ బజాజ్‌ను 2021 మే 1 నుండి కంపెనీ ఛైర్మన్ ఎమెరిటస్‌గా నియమించింది. 

రాహుల్ బజాజ్ అధ్యయనం
రాహుల్ బజాజ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త జమ్నాలాల్ బజాజ్ మనవడు. ఢీల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి విద్యాను అభ్యసించాడు. అతను ముంబైలోని లా యూనివర్శిటీ నుండి న్యాయ పట్టా కూడా పొందాడు.
 
నీరజ్ బజాజ్ ఎవరు 
రాహుల్ బజాజ్ బంధువు నీరజ్ బజాజ్ కంపెనీ చైర్మన్ పాత్రలో  కొత్తగా నియామకంకానున్నారు. నీరజ్ బజాజ్ వయసు 67 సంవత్సరాలు, ఈ రంగంలో  అతనికి 35 సంవత్సరాల అనుభవం ఉంది. అలాగే అతను బజాజ్ గ్రూప్ కంపెనీలో కీలక పదవులను నిర్వహించారు. అతను సెప్టెంబర్ 2006లో బజాజ్ ఆటో లిమిటెడ్ బోర్డులో చేరారు. యూ‌ఎస్ లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి ఎం‌బి‌ఏ పూర్తి చేశాడు. అతను బజాజ్ అల్లియన్స్ లైఫ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ల బోర్డులో కూడా ఉన్నాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios