Asianet News TeluguAsianet News Telugu

భారతదేశానికి వ్యతిరేకంగా బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు.. కరోనా వాక్సిన్ ఫార్ములా పంచుకోవద్దు అంటు..

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోని అగ్రశ్రేణి వ్యాపారవేత్త బిల్ గేట్స్ కరోనా టీకా సూత్రాన్ని భారత్‌తో సహా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోలేకోవద్దు అంటూ   కీలక వ్యాఖ్యలు  చేశారు.

Bill Gates says COVID vaccine formula should not be shared with India, developing nations, sparks row
Author
Hyderabad, First Published Apr 30, 2021, 1:35 PM IST

న్యూఢీల్లీ: కరోనా వైరస్  సెకండ్ వేవ్ భారత్ ని వాణికిస్తోంది. కోవిడ్-19 ద్వారా దేశం తీవ్రంగా ప్రభావితమైంది అలాగే ప్రపంచం మొత్తం భారత్ కు మద్దతును అందించడం ప్రారంభించింది. ఈ పరిణామంలో టెక్ దిగ్గజం, ఫిలోంథ్రఫిస్ట్ బిల్ గేట్స్  కరోనా వాక్సిన్ టెక్నాలజి  పేటెంట్లకు సంబంధించి వివాదాస్పద ప్రకటన చేశారు.

కరోనా వైరస్ అరికట్టడంలో అలాగే వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంలో ప్రపంచం మొత్తం కృషి చేస్తోంది. ఈ క్లిష్ట సమయంలో కరోనా  వైరస్ ని నివారించడానికి వ్యాక్సిన్ ప్రస్తుతం సమర్థవంతమైన మార్గంగా పరిగణించబడుతుంది.  

 కొన్ని నివేదికల ప్రకారం ఈ భారీ సంక్షోభం మధ్య బిల్ గేట్స్  తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ల  సూత్రాల విధానాన్ని పంచుకునేందుకు వీలుగా మేధో సంపత్తి చట్టాన్ని మార్చడం సాధ్యమా అని స్కై న్యూస్‌ ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ ని ప్రశ్నించగా అభివృద్ధి చెందుతున్న దేశాలతో వాక్సిన్ సూత్రాలను పంచుకోవడాన్ని ఆయన స్పష్టంగా ఖండించారు. 

అతని సమాధానానికి వివరణ గురించి అడిగినప్పుడు బిల్ గేట్స్  "ప్రపంచంలో టీకాలు తయారుచేసే కర్మాగారాలు చాలా ఉన్నాయి.  వాక్సిన్ ఫార్ములా పంచుకోకూడదు. అమెరికాలోని జాన్సన్ & జాన్సన్ ఫ్యాక్టరీకి  భారతదేశంలోని వ్యాక్సిన్ల తయారీ కర్మాగారానికి చాలా తేడా ఉంది. మా నైపుణ్యం, డబ్బు విజయవంతమైన వ్యాక్సిన్‌ను తయారుచేస్తాయి.

కరోనా టీకా సూత్రం ఎవరితోనైనా పంచుకోగలిగే  పేటెంట్ లాంటిది కాదని బిల్ గేట్స్ చెప్పారు. అది కేవలం మేధో సంపత్తికి సంబంధించిన విషయం కాదు. ఈ టీకా చేయడానికి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, పరీక్షలు చేయవలసి ఉంటుంది, దీనిని ప్రయత్నించాలి. వ్యాక్సిన్ తయారుచేసేటప్పుడు ప్రతిదీ చాలా జాగ్రత్తగా పరీక్షించబడుతుంది.

బిల్ గేట్స్ అక్కడితో ఆగలేదు. 30 సంవత్సరాల వయస్సులో ఉన్నవారు కూడా యుఎస్, యుకెలో టీకాలు పొందుతున్నారు, కానీ బ్రెజిల్ ఇంకా దక్షిణాఫ్రికాలో 60 సంవత్సరాలు దాటని వారికి టీకాలు వేయడం లేదు. ఇది అన్యాయం అలాగే  తీవ్రమైన కరోనా సంక్షోభం ఎదుర్కొంటున్న దేశాలకు రెండు-మూడు నెలల్లో వ్యాక్సిన్ లభిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలలో టీకాలు వేయడం పూర్తయిన తర్వాత, పేద దేశాలకు కూడా వ్యాక్సిన్లు అందించబడతాయి అని అన్నారు.

దేశంలోని అతిపెద్ద సంస్థ అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII), ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం ప్రకారం కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను తయారు చేస్తోంది.

  కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా మేధో సంపత్తి హక్కులపై చర్చ జరుగుతోంది. వ్యాక్సిన్ అందరికీ సులభంగా అందుబాటులో ఉండేలా వ్యాక్సిన్ ఫార్ములాపై మేధో సంపత్తి హక్కులపై నిషేధాన్ని తొలగించాలని ప్రపంచంలోని చాలా దేశాలు కోరుకుంటున్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా భద్రత, నాణ్యతను పేర్కొంటూ టీకా సూత్రాన్ని పంచుకోవద్దని వాదనలు  కూడా ఉన్నాయి.
    

Follow Us:
Download App:
  • android
  • ios