Asianet News TeluguAsianet News Telugu

సామాన్యులపై ఇంధన పిడుగు.. నేడు మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

గత 18 రోజుల పాటు స్థిరంగా  ఉన్న ఇంధన ధరలు నేడు మళ్ళీ పెరిగాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో  నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.90.55 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.80.91 ఉంది.
 

Petrol Diesel Prices Today May 04 2021: Fuel prices hiked after 18-day pause check prices in metro cities
Author
Hyderabad, First Published May 4, 2021, 10:56 AM IST

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత సామాన్యులపై ఇంధన భారం పడింది. రాష్ట్ర చమురు కంపెనీలు మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను సవరించాయి. గత 18 రోజుల పాటు స్థిరంగా  ఉన్న ఇంధన ధరలు నేడు పెరిగాయి.

అంతకుముందు ఫిబ్రవరి 27న పెట్రోల్ ధరపై  24 పైసలు, డీజిల్ లీటరుపై 17 పైసలు పెరిగింది. 

నేడు పెట్రోల్ ధరపై 15 పైసలు, డీజిల్ ధర లీటరుకు 18 పైసలు పెరిగింది. మంగళవారం ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.90.55 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.80.91. ముంబైలో పెట్రోల్ ధర రూ .96.95, డీజిల్ ధర లీటరుకు రూ .87.98. 

also read దేశంలో 4వ సంస్థ రిలయన్స్ సరికొత్త ఘనత.. 100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో రిలయన్స్‌ రీటైల్‌ ...

 నగరం    డీజిల్    పెట్రోల్
ఢీల్లీ          80.91    90.55
ముంబై    87.98    96.95
కోల్‌కతా    83.78    90.76
చెన్నై    85.90    92.55

హైదరాబాద్  88.25   93.99

 
 ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తుంటారు. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి. పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలపై  ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర జోడించిన తరువాత దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది.

ఈ ప్రమాణాల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్,  డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. 

 పెట్రోల్, డీజిల్ ధరలను ఎస్ఎంఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం మీరు ఆర్‌ఎస్‌పి అండ్ మీ సిటీ పిన్ కోడ్‌ను వ్రాసి 9224992249 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్  పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios