కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలపై పన్ను తగ్గించేందుకు కేంద్రం అడుగులు వేస్తున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

దేశంలో చుక్కలనంటుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు వున్నాయని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అదే నిజమైతే వాహనదారులకు నిజంగా శుభవార్తే. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం పన్ను తగ్గించే ఆలోచనలో వున్నట్లుగా తెలుస్తోంది. దేశంలోని రిటైల్ ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ఆర్‌బీఐ కీలక పాలసీ రేట్లను పెంచుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ కీలక సూచనలు చేసినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీని ప్రకారం.. మొక్కజోన్న, ఫ్యూయెల్ వంటి కొన్నింటిపై ట్యాక్స్‌ను తగ్గించే ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. 

ALso REad: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలంటూ మళ్లీ కాంగ్రెస్ రావాల్సిందే...: రేవంత్ రెడ్డి

అటు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ క్రూడాయిల్ ధరలు తగ్గాయి. గత కొన్ని నెలలుగా అవి స్థిరంగానే వున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ మనదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదు. కేంద్రం పన్నులు తగ్గిస్తేనే ఇవి కిందకి దిగొస్తాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరి కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ద్రవ్యోల్బణం నేపథ్యంలో కేంద్రం గుడ్ న్యూస్ చెబుతుందనే చాలా మంది ఆశిస్తున్నారు. ఇదిలావుండగా.. పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధంగానే వుందన్నారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. అయితే దీనికి రాష్ట్రాలు అంగీకరించాల్సి వుందన్నారు.