ఫిలాంత్రొఫికి ఎక్కువ సమయం కేటాయించడానికి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్  డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకుంటున్నట్లు మైక్రోసాఫ్ట్ శుక్రవారం ప్రకటించింది.

ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకడైన బిల్ గేట్స్,1975లో పాల్‌ అలెన్‌తో కలిసి బిల్‌గేట్స్‌ మైక్రోసాఫ్ట్‌ స్థాపించారు. బిల్ గేట్స్ 2000 లో తన సి‌ఈ‌ఓ పదవికి రాజీనామా చేసి, తన స్వచ్ఛంద సంస్థకు ఎక్కువ సమయం కేటాయించడానికి కంపెనీ పగ్గాలను స్టీవ్ బాల్‌మెర్‌కు అప్పగించాడు.

 ఫిలాంత్రొఫికి ఎక్కువ సమయం కేటాయించడానికి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకుంటున్నట్లు మైక్రోసాఫ్ట్ శుక్రవారం ప్రకటించింది.

also read పెట్రోల్, డీజిల్‌పై ప్రభుత్వం షాకింగ్ న్యూస్...

64 ఏళ్ల బిల్ గేట్స్ ఒక దశాబ్దం క్రితం 2008 నుంచి సంస్థలో ఫుల్‌టైం కార్యకలాపాలకు కూడా గుడ్‌బై చెప్పారు. బిల్ గేట్స్ అతని భార్య మెలిండా పేరు మీద ఉన్న బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ పై దృష్టి సారించాడు.

ఈ ఫౌండేషన్‌ ద్వారా పలు దేశాల్లో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్య, ఆర్థికం, ఉపాధి కల్పనా రంగాల్లో ఫౌండేషన్‌ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్‌గా 2014 ప్రారంభం వరకు పనిచేశారు. ఇప్పుడు డైరెక్టర్ల బోర్డు నుంచి పూర్తిగా వైదొలగుతున్నారు.

"గత కొన్ని సంవత్సరాలుగా బిల్‌ గేట్స్ తో కలిసి పనిచేయడం ఎంతో గౌరవం, ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను" అని మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, కంపెనీ వెటరన్ సత్య నాదెల్లా ఒక ప్రకటనలో తెలిపారు.

also read భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు...తులం ఎంతంటే ?

 బిల్ గేట్స్ సాంకేతిక సలహాదారుడిగా ఇక నుంచి కొనసాగనున్నారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్లకు, ఇతర ప్రముఖులకు బిల్‌గేట్స్‌ సాంకేతిక సహకారం అందించనున్నారు అని నాదెల్లా తెలిపారు.

బిల్ గేట్స్ తన సిఇఒ పదవిని 2000 లో విడిచిపెట్టారు. తన ఛారిటబుల్ ఫౌండేషన్ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి కంపెనీ పగ్గాలను స్టీవ్ బాల్‌మెర్‌కు అప్పగించాడు. అతను చైర్మన్ పదవికి రాజీనామా చేశాక సత్యా నాదెల్లా 2014లో మైక్రోసాఫ్ట్ మూడవ సి‌ఈ‌ఓగా ఎంపికయ్యాడు.