Asianet News TeluguAsianet News Telugu

పెట్రోల్, డీజిల్‌పై ప్రభుత్వం షాకింగ్ న్యూస్...

ప్రభుత్వం నుండి  వెలువడిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, పెట్రోల్‌పై ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 2 నుండి 8 రూపాయలు అలాగే డీజిల్ పై 4 రూపాయలకు పెంచింది. అదనంగా, పెట్రోల్‌పై రోడ్ సెస్‌ను రూ. 1 పెంచింది.

Govt hikes excise duty on petrol and diesel in india
Author
Hyderabad, First Published Mar 14, 2020, 11:14 AM IST

న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రజలపై బాగా ప్రభావితం చేసే విధంగా, అంతర్జాతీయ చమురు ధరల తగ్గుదల వల్ల కలిగే లాభాలను పెంచుకోవటానికి ప్రభుత్వం శనివారం పెట్రోల్, డీజిల్ రెండింటిపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 3 రూపాయలు పెంచింది.

ప్రభుత్వం నుండి  వెలువడిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, పెట్రోల్‌పై ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 2 నుండి 8 రూపాయలు అలాగే డీజిల్ పై 4 రూపాయలకు పెంచింది. అదనంగా, పెట్రోల్‌పై రోడ్ సెస్‌ను రూ. 1 పెంచింది.

also read భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు...తులం ఎంతంటే ?

ఎక్సైజ్ సుంకం పెరగడం   వల్ల పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు దారితీస్తుంది. అయితే అంతర్జాతీయ చమురు ధరల క్షీణత కారణంగా రేట్ల తగ్గింపుకు వ్యతిరేకంగా ఇది చాలావరకు సర్దుబాటు చేస్తుంది.

చమురు ఉత్పత్తిదారుల మధ్య జరిగిన ధరల యుద్ధం కారణంగా సోమవారం అంతర్జాతీయ ముడి ధరల అతిపెద్ద మార్జిన్ తో కుప్పకూలిపోవడంతో దాదాపు ఎనిమిది నెలల్లో తొలిసారిగా పెట్రోల్ ధర 71 రూపాయల మార్కుకు పడిపోయింది.

also read షాపింగ్ చేస్తున్నారా జాగ్రత్త ! కరోనావైరస్ నెక్స్ట్ టార్గెట్ మీరే...

మార్చి 9 న, అంతర్జాతీయ చమురు ధరలు 31 శాతానికి దగ్గరగా కుప్పకూలిపోయాయి. ముడి చమురు ధరల క్షీణత భారతీయ అప్‌స్ట్రీమ్ కంపెనీలకు క్రెడిట్ ప్రతికూలంగా ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ముడి ధరలు బ్యారెల్కు-30-40 చొప్పున ఉంటే, చాలా మంది భారతీయ అప్‌స్ట్రీమ్ కంపెనీలు నష్టాలను చూడగలవు. 

అదనంగా, వివిధ అంతర్జాతీయ గ్యాస్ హబ్‌లలో గ్యాస్ ధరలు తగ్గాయి. ఇది వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీయ గ్యాస్ ధరలను తగ్గటానికి దారితీస్తుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios