డబ్బులు లేకుండా షాపింగ్ చేయవచ్చా? అంటే ఎవరైనా ఎలా సాధ్యమవుతుంది? అని తిరిగి ప్రశ్నిస్తారు. అయితే, తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మాత్రం ఆశ్చర్యం పోవాల్సిందే. ఎందుకంటే తన బ్యాంక్ అకౌంట్‌లో జీరో బ్యాలెన్స్ ఉన్నా షాపింగ్ చేసి ఓ యువకుడు సంచలనం సృష్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 

‘వెబ్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన టిక్‌టాక్‌లో ఇంతవరకూ ఒక్క వీడియోను కూడా చూడలేదు. అయితే దీని గురించి నేనేం నిరాశ చెందడం లేదు’ అనే మాటలతో ఆ వీడియో మొదలవుతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి తన బ్యాంక్ బ్యాలెన్స్ తనిఖీ చేయగా.. జీరో బ్యాలెన్స్ చూపిస్తుంది.

దీంతో ఆ వ్యక్తి తన బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించి వెబ్‌పేజ్ ఓపెన్ చేసి.. బ్యాక్‌ఎండ్‌కి వెళ్లి ఎమౌంట్ దగ్గర తనకు కావాల్సినంత సొమ్ము యాడ్ చేస్తాడు. తర్వాత ఆన్‌లైన్‌లో తనకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తాడు.  

అయితే, ఇలా చేయడం వీలవుతుందో కాదో తెలియదు కానీ.. అతడి వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది తమదైన శైలిలో స్పందిస్తూ.. లైక్స్, షేర్లు చేస్తున్నారు. ట్విట్టర్‌లో అయితే ఈ వీడియోకు కామెంట్ల వర్షం కురుస్తోంది.