భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) టర్మ్ హోం లోన్స్ 8.6శాతం వడ్డీరేటుతో ప్రారంభమవుతున్నాయి. https://homeloans.sbi/ ప్రకారం.. రూ. 75లక్షల వరకు కూడా ఎస్బీఐ వడ్డీ రేటు 8.6శాతం నుంచి 9.15శాతం వరకు ఉంది.  ఎల్టీవీ లేదా లోన్ టు వాల్యూ రేషియో, దరఖాస్తుదారుడి రిస్క్ ఫ్యాక్టర్‌పై ఆదారపడి వుంటుంది. అతడు జీతాగాడా కాదా అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. 

మహిళా ఖాతాదారులకు ఇతరులకంటే 5బేసిస్ పాయింట్లు(0.05శాతం) తక్కువ వడ్డీరేటుకే ఎస్బీఐ హోంలోన్స్ అందిస్తుండటం గమనార్హం. 

నెల నెలా జీతం పొందే వ్యక్తులకు ఎస్బీఐ (టర్మ్)హోంలోన్స్ వడ్డీరేటు:

జీతం పొందే మహిళలకు రూ. 30లక్షల వరకు టర్మ్ హోంలోన్స్ 8.6శాతం-8.7శాతం వడ్డీరేటుకే ఎస్బీఐ అందిస్తోంది. ఇతర జీతం పొందే  కస్టమర్లకైతే 8.65-8.75శాతం వడ్డీరేటుతో అందిస్తోంది.

ఇక హోంలోన్స్ అయితే జీతం పొందే మహిళలకు రూ. 30లక్షలు-75లక్షల వరకు 8.85శాతం-8.95శాతం వడ్డీరేటుతో అందిస్తోంది. ఇతర జీతం పొందే కస్టమర్లకు 8.9శాతం-9శాతం వడ్డీరేటుతో అందిస్తోంది. 

ఎస్పీఐ హోంలోన్ వడ్డీరేటు(టర్మ్ లోన్) నాన్ శాలరైజ్డ్ ఇండివిజువల్స్(జీతాలు లేని వ్యక్తులు):

నాన్ శాలరైజ్డ్ మహిళలకు రూ. 30లక్షల హోంలోన్స్ వరకు 8.75శాతం-8.85శాతం వడ్డీరేటుకే ఎస్బీఐ అందిస్తోంది. ఇతర కస్టమర్లకు 8.8శాతం-8.9శాతం వడ్డీరేటుకే హోంలోన్స్ అందిస్తోంది. 

రూ. 30లక్షల-75లక్షల వరకు హోంలోన్స్ విషయానికొస్తే నాన్ శాలరైజ్డ్ మహిళలకు 9-9.1శాతం వడ్డీరేటుకే అందిస్తుండగా, ఇతర నాన్ శాలరైజ్డ్ కస్టమర్లకు 9.05-9.15శాతం వడ్డీరేటుకే హోంలోన్స్ అందిస్తోంది ఎస్బీఐ.

రూ. 75లక్షలకు మించి హోంలోన్స్ విషయానికొస్తే..:

రూ. 75లక్షలకు మించిన హోంలోన్స్ అయితే మహిళా కస్టమర్ల నుంచి ఐతే 8.95శాతం-9.2శాతం వరకు వడ్డీని వసూలు చేయడం జరుగుతుంది. ఇతర కస్టమర్ల నుంచి 9శాతం-9.3శాతం వసూలు చేస్తారు. 

దరఖాస్తుదారుడిని బట్టి కూడా ఎస్బీఐ హోంలోన్స్ వడ్డీరేటు నిర్ణయించబడుతుంది:

కస్టమర్ రిస్క్ సోర్సెస్ ఆధారంగా హోంలోన్స్ ఇవ్వడం జరుగుతుంది. హోంలోన్స్ తీసుకునే వ్యక్తి తిరిగి చెల్లించగలరా? లేదా అనే విషయాలు, అతని ప్రొఫైల్‌కు సంబంధించిన విషయాలను గమనించిన తర్వాతే హోంలోన్స్ ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తుదారుడి ఆదాయం, క్రెడిట్ స్కోరు, లోన్ టు వాల్యూ రేషియో తదితర అంశాలను బ్యాంకు పరిగణలోకి తీసుకుంటుంది. ఎల్టీవీని ఉపయోగించి బ్యాంకులు రిస్కును అంచనా వేస్తాయి.

ఎస్బీఐ హోంలోన్స్ ప్రాసెసింగ్ ఫీ:

హోంలోన్స్ ప్రాసెసింగ్ చేయడానికి ఎస్బీఐ రూ. 2000 నుంచి 10,000(పన్నులు కలపకుండా) వరకు కూడా ఫీజును వసూలు చేస్తుంది. 0.35శాతం ఫీజును లోన్ ఎమౌంట్(పన్నులు కలపకుండా) నుంచి వసూలు చేస్తారు. అయితే, మే 31 వరకు ఎస్బీఐ లోన్ ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేసింది.