Gold Jewelry: ఈ రోజుల్లో బంగారు నగలు కొనడం కంటే వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే నగలు కొన్ని రోజులకే రంగు కోల్పోతున్నాయి. పాత వాటిలా మారిపోతున్నాయి. బంగారం ధరలు చూస్తే కొత్తవి ఎప్పుడుపడితే అప్పుడు కొనే పరిస్థితి లేదు. అందుకే పాత నగలను కూడా కొత్త వాటిలా మెరిసేలా ఉంచడానికి ఈ చిట్కాలు మీకు బాగా ఉపయోగపడతాయి. 

అందంగా కనిపించడానికి ఎక్కువ మంది బంగారు నగలు వేసుకుంటారు. కాని ఇష్టపడి కొన్న నగలు కొన్ని రోజులకే మెరుపు తగ్గి మురికిగా తయారవుతున్నాయి. నగల తయారీలో నాణ్యత లేకపోవడం, పొల్యూషన్ ఇలా దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందుకే తరచూ వాటికి పాలిష్ చేయిస్తుంటారు. బంగారు నగలు ఎన్ని సంవత్సరాలైనా కొత్త వాటిలా మెరవడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఇంట్లోనే పాటిస్తే సరిపోతుంది.

బంగారు నగలను ఇంట్లోనే శుభ్రం చేసే విధానాలు

బంగారాన్ని సబ్బు కలిపిన గోరువెచ్చని నీటిలో ఇరవై నిమిషాలు నానబెట్టి, మెత్తని బ్రష్ లేదా దూదితో నెమ్మదిగా తుడవాలి. తర్వాత శుభ్రమైన గుడ్డతో తుడవండి. ప్రత్యేకంగా శుభ్రం చేసే ద్రావణాలు (gold cleaning solution) వాడితే మరింత మంచిది.

నగలను కనీసం నెలకు ఒకసారి శుభ్రం చేయడం వల్ల వాటి మెరుపును కాపాడుకోవచ్చు. రోజూ పెట్టుకునే నగలను వారానికి ఒకసారి కొద్దిసేపు శుభ్రం చేస్తే సరిపోతుంది. ఇంట్లోనే గోరువెచ్చని నీటిలో కొద్దిగా అమ్మోనియా కలిపి నగలను కడగవచ్చు. కానీ ఇది వారానికి ఒకసారి మాత్రమే చేయాలి.

సంవత్సరానికి ఒకసారి నగల నిపుణుల దగ్గర మీ నగలు టెస్ట్ చేయించుకోండి. చిన్న మరమ్మతులు ఉంటే సరిచేయించుకుంటే నగలు ఎక్కువ కాలం పాటు మెరుస్తూ ఉంటుంది. కొన్ని రకాల బంగారాలు సున్నితంగా ఉంటాయి. కాబట్టి వాటిని పాలిష్ చేయించడం ద్వారా మెరిసేలా ఉంచుకోవచ్చు.

బంగారు నగలను ఇలా జాగ్రత్తగా ఉంచండి

పెర్ఫ్యూమ్, స్ప్రే, సబ్బు, క్రీమ్ వంటి రసాయనాలు బంగారం పూతను పాడు చేస్తాయి. కాబట్టి వీటిని ఉపయోగించే ముందు నగలు తీసివేయాలి. పౌడర్, ఇతర మేకప్ వస్తువులు వాడేటప్పుడు అవి బంగారంపై పేరుకుపోతాయి. దీంతో నగల సహజ మెరుపు తగ్గిపోతుంది. మేకప్ అంతా పూర్తయిన తర్వాతే నగలు ధరించాలి.

ఎక్కువసేపు ఎండలో లేదా తేమ ఎక్కువగా ఉండే ప్రదేశంలో బంగారం నగలు ఉంచితే సహజమైన మెరుపు తగ్గుతుంది. కాబట్టి వాటిని సురక్షితంగా, తక్కువ తేమ ఉండే చోట ఉంచాలి. అంతేకాకుండా రసాయన పదార్థాలకు కూడా దూరంగా ఉంచడం మంచిది. 

ఇది కూడా చదవండి హోలీ పండగ మార్చి 14న? 15న? పూర్తి వివరాలతో క్లారిటీ ఇదిగో?

బంగారు నగలను పెట్టెలో విడిగా ఉంచండి 

బంగారాన్ని ఇతర నగలతో కలిపి ఉంచే బదులు ఒక్కొక్కటిగా ప్రత్యేకమైన క్లాత్ బ్యాగ్స్ లో ఉంచితే మంచిది. కొన్ని నగల పెట్టెల్లో మెత్తటి గుడ్డ పొర ఉంటుంది. వాటిలో కూడా ఉంచవచ్చు. ప్రతి నగకు ప్రత్యేకమైన పెట్టెను ఉపయోగిస్తే నగల మధ్య రాపిడి లేకుండా చేయవచ్చు. 

ఇది కూడా చదవండి రాత్రిపూట ఈ 5 పండ్లు అస్సలు తినొద్దు! మీ నిద్ర చెడిపోతుంది

పనులు చేసేటప్పుడు బంగారు నగలు తీసేయడం మంచిది

మీరు కష్టమైన పనులు చేసేటప్పుడు బంగారు నగలను తీసివేయడం మంచిది. వంట చేయడం, వ్యాయామం చేయడం, ఇంటి పనులు చేసే సమయంలో నగలు మురికిగా మారవచ్చు. లేదా మెరుపు తగ్గిపోవచ్చు. వాటిని తీసి పనులు చేయడం