హైదరాబాద్: వరల్డ్ ఫేవరైట్ జువెల్లర్ జోయాలుక్కాస్ తన వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్ నగరంలోని ఏఎస్‌రావునగర్‌లో ఇటీవల నాలుగో షోరూంను ఏర్పాటు చేసింది. ఈ షోరూంను ప్రముఖ బాలీవుడ్ నటి, జోయాలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్ కాజేల్ దేవగణ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా అక్షయ తృతీయ కలెక్షన్స్ ఆవిష్కరించారు. ‘జోయాలుక్కాస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. నేను షోరూంను ప్రారంభించడంతోపాటు శుభప్రదమైన అక్షయ తృతీయ కలెక్షన్స్ కూడా ఆవిష్కరించాను. వేలాది సంఖ్యలో ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆభరణాల అభిమానులను కలుసుకోవడం మరింత ఆనందంగా ఉంది’ అని కాజోల్ అన్నారు.

‘హైదరాబాద్ మాకెంతో ప్రత్యేకం. పెరుగుతున్న మా వినియోగదారుల ఆదరణ, మద్దతుతోనే నగరంలో మరో షోరూం ఏర్పాటు చేశాం’ అని జోయాలుక్కాస్ గ్రూప్ ఛైర్మన్, ఎండీ జోయాలుక్కాస్ వ్యాఖ్యానించారు. జోయాలుక్కాస్ బ్రాండ్ నుంచి అదే ప్రపంచ స్థాయి ఆభరణాలను ఈ షోరూం ద్వారా అందిస్తున్నామని తెలిపారు.

వజ్రాల ప్రియుల కోసం ఈ షోరూంలో ఓ ఫ్లోర్‌ను పూర్తిగా వజ్రాల ఆభరణాల కోసమే కేటాయించారు. లేటెస్ట్ ట్రెండ్, స్టైల్, డిజైన్లలో వీటిని రూపొందించారు. ఈ షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా ‘ఫ్రీ ష్యూర్ గిఫ్ట్స్’ ఆఫర్‌తో ప్రతి కొనుగోలుదారుడికి రివార్డు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.

‘ప్రపంచ వ్యాప్తంగా 200 షోరూంలను విస్తరించాలనే విజన్ 2020 లక్ష్యంతో హైదరాబాద్ ఏఎస్‌రావునగర్‌లో తమ కొత్త షోరూం ప్రారంభించాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జువెల్లరీ అభిమానులకు మా బ్రాండ్ నుంచి ఆభరణాలను అందించడమే మా లక్ష్యం. ఏఎస్‌రావునగర్, దాని పరిసరాల్లోని ప్రజలను మా షోరూంను సందర్శించాలని స్వాగతం పలుకుతున్నాం. ప్రత్యేకమైన ట్రడిషనల్ హైదరాబాదీ జువెల్లరీ కలెక్షన్, ఉత్తమ ఉత్పత్తులు, సేవలు, ప్రారంభోత్సవ ఆఫర్ ‘ఫ్రీ ష్యూర్ గిప్ట్స్’ పొందాలని కోరుతున్నాం. ప్రతి కొనుగోలుపై వినియోగదారుడికి ఉచిత హోం అప్లయెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని మా అన్ని షోరూంలలో ప్రత్యేకమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అంతేగాక, జోయాలుక్కాస్‌లో కొనుగోలు చేసిన ఆభరణాలపై ఫ్రీ మెయింటనెన్స్, ఏడాదిపాటు ఉచిత ఇన్స్యూరెన్స్ అందిస్తున్నాం’ అని జోయాలుక్కాస్ వివరించారు.