వాలంటైన్స్ డే ఆఫర్...తక్కువ ధరకే ఫ్లయిట్ టికెట్లు...
భారతదేశంలో అతిపెద్ద క్యారియర్ ఇండిగో ఈ ఆఫర్ కింద 10 లక్షల సీట్లను కేటాయించింది. ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు ప్రత్యేక వాలెంటైన్ డే ఆఫర్ సేల్స్ అందుబాటులో ఉంటాయి.
చౌక క్యారియర్ ఇండిగో సంస్థ ఈ రోజు భారతదేశంలో తన నెట్‌వర్క్‌లోని అన్నీ రుట్లలో ప్రయనించడానికి నాలుగు రోజుల పాటు ప్రత్యేక వాలంటైన్స్ డే ఆఫర్ ప్రకటించింది. ప్రత్యేక వాలెంటైన్ డే ఆఫర్లో భాగంగా అన్ని కలుపుకొని టికెట్ ఛార్జీలు రూ. 999 నుండి ప్రారంభమవుతాయి.
భారతదేశంలో అతిపెద్ద క్యారియర్ ఇండిగో ఈ ఆఫర్ కింద 10 లక్షల సీట్లను కేటాయించింది. ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు ప్రత్యేక వాలెంటైన్ డే ఆఫర్ సేల్స్ అందుబాటులో ఉంటాయి.
also read వంట గ్యాస్ ధర మళ్ళీ పెరిగింది...సిలిండర్ పై ఎంతంటే ?
ఇండిగో ప్రత్యేక వాలెంటైన్ డే ఆఫర్లో టికెట్ బుక్ చేసుకున్నా వారు మార్చి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రణయనించడానికి చెల్లుతుంది. బయలు దేరే 15 రోజుల ముందు టిక్కెట్లను కన్ ఫార్మ్ చేసుకోవాలి.
కొన్ని ఇండిగో మార్గాల్లో విమాన టికెట్ ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి ఢిల్లీ-అహ్మదాబాద్ రూ .1699, ఢిల్లీ -అమృత్సర్‌పై రూ.1699, ఢిల్లీ-బెంగళూరులో రూ.2799, ఢిల్లీ-భువనేశ్వర్‌లో రూ. 2999, ఢిల్లీ-గోవా రూ. 3999, ఢిల్లీ -హైదరాబాద్ రూ. 2049, ఢిల్లీ-కోల్‌కతా రూ.2699, ఢిల్లీ-ముంబై రూ. 2,599, ఢిల్లీ-పాట్నాలో రూ.1,999, ఢిల్లీ-సూరత్ రూ. 2,499, ఢిల్లీ-సూరత్ రూ.3,699, ఢిల్లీ-వైజాగ్ రూ.3,799.
కొన్ని ఇతర ఇండిగో రుట్లలో ప్రారంభ ఛార్జీలు బెంగళూరు నుండి అహ్మదాబాద్ వరకు రూ. 2699, బెంగళూరు నుండి బాగ్డోగ్రా రూ.3999, బెంగళూరు నుండి భువనేశ్వర్ రూ.2899, బెంగళూరు నుండి ఔరంగాబాద్ వరకు రూ.2699, బెంగళూరు నుండి గోవా వరకు రూ.1399, బెంగళూరు నుండి ఢిల్లీకి రూ.2899.
ఈ ఆఫర్ విమాన ఛార్జీలకు సంబంధించిన ఇతర ఆఫర్, స్కీమ్ లేదా ప్రమోషన్‌తో క్లబ్బింగ్ ఉండదు అలాగే ఈ ఆఫర్ కింద బుక్ చేసిన టికెట్లను బదిలీ చేయడానికి, మార్పులు చేయడానికి, ఎన్ ఎన్‌కాష్ చేయడానికి వీల్లేదు అని ఇండిగో తెలిపింది.
also read సుందర్ పిచాయ్ కి వరుస షాక్‌లు... గూగుల్‌కు ఏమైంది?
250 కిపైగా విమానాలను కలిగి ఉన్న ఇండిగోలో రోజు 1,500 కి పైగా విమానాలలో ఈ ఆఫర్ అందిస్తుంది. దేశంలో 63 నగరాలకు, 23 అంతర్జాతీయ దేశాలకు ప్రయాణం ఇండిగో ఎయిర్ లైన్స్ నుండి ప్రయాణం చేయవచ్చు.
డోమెస్టిక్ ఎయిర్ పాసెంజర్ మార్కెట్లో సుమారు 48% మార్కెట్ వాటాను ఇండిగో కలిగి ఉంది. ఈ వారం ప్రారంభంలో ప్రయాణికులు ఫ్లయిట్ టికెట్ బుకింగ్‌ల కోసం వారికి నచ్చిన భాషలో తన హిందీలో కూడా వెబ్‌సైట్‌ను ఇండిగో ప్రారంభించింది.