వాహన్ డాటాబేస్ కి మొబైల్ నంబర్లను తప్పనిసరిగా లింక్ చేయాలి...
ఏప్రిల్ 1, 2020 నుంచి వాహన యజమానులు తమ వాహన రిజిస్ట్రేషన్కు మొబైల్ నెంబర్లను వాహన్ డేటాబేస్కు లింక్ చేయాలి అని తెలిపింది. ఇలా చేయటం వల్ల వాహన రిజిస్ట్రేషన్, వాహనలకు సంబంధించిన అనేక సమాచారాన్ని పొందటానికి సహాయపడుతుంది.
1989 సెంట్రల్ మోటారు వాహనాల నిబంధనలకు సంబంధించి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 29 నవంబర్ 2019న వాహన యజమానులు తమ మొబైల్ నంబర్లను వాహన్ డేటాబేస్ తో తప్పనిసరిగా లింక్ చేయాలి అని నోటిఫికేషన్ విడుదల చేసింది. మరో 30 రోజుల్లోపు ఈ కొత్త నిబంధనలపై ప్రజల అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది.
ఏప్రిల్ 1, 2020 నుంచి వాహన యజమానులు తమ వాహన రిజిస్ట్రేషన్కు మొబైల్ నెంబర్లను వాహన్ డేటాబేస్కు లింక్ చేయాలి అని తెలిపింది. ఇలా చేయటం వల్ల వాహన రిజిస్ట్రేషన్, వాహనలకు సంబంధించిన అనేక సమాచారాన్ని పొందటానికి సహాయపడుతుంది.
also read కార్పొరేట్ పన్నుల భారం తగ్గిస్తూ.... పార్లమెంటు ఆమోదం
ఈ విషయంపై రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, నవంబర్ 29, 2019న నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ మోటారు వాహనాల నిబంధనల ప్రకారం 30 రోజుల్లోపు ఈ కొత్త నిబంధనలపై ప్రజల అభిప్రాయాలను కోరింది."సాధారణంగా వాహన ధృవీకరణకు సంబంధించిన లేదా ఏదైనా సేవ కోసం, మొబైల్ నంబర్లు అధికారికంగా అనుసందానించలేదు.
కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో మాత్రమే OTP కోసం ఉపయోగించబడుతున్నాయి కాని ఆ నెంబర్లు డేటాబేస్లో ఉండవు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి కార్లకు సంబంధించిన ఏ విధమైన సమాచారం లేదా సేవల గురించి మొబైల్ నెంబర్లను మా వాహన్ డేటాబేస్‌తో అనుసంధానించడం తప్పనిసరి "అని సీనియర్ రవాణా మంత్రిత్వ శాఖ అధికారి హిందుస్తాన్ టైమ్స్‌తో అన్నారు.
also read ఆర్బీఐకి ‘ఉల్లి’ ఘాటు...వరుస కోతలకు ‘ధరల’ బ్రేక్’
రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ద్వారా కేంద్ర జాతీయ రిజిస్ట్రీను నిర్వహిస్తుంది. దీనికి సుమారు 25 కోట్ల వాహనాల రిజిస్ట్రేషన్ రికార్డులు ఉన్నాయి.సెంట్రల్ మోటారు వాహనాల నిబంధనలు, 1989 ప్రకారం మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు, కొత్త లేదా డూప్లికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, రేనివల్ సమయంలో మొబైల్ నంబర్ ఉపయోగపడుతుంది.
నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇంకా అప్లికేషన్ మంజూరు చేయడానికి మొబైల్ నంబర్ అవసరం ఉంటుంది. వెహికిల్ ఓనర్ మారినపుడు లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో చిరునామాను మార్చడానికి కూడా మొబైల్ నంబర్ అవసరం. వెహికిల్ రెంట్ తిసుకోవలన్న-కొనుగోలు చేయాలన్న / లీజు హైపోథెకేషన్ కోసం అప్లికేషన్ చేసుకునే సమయంలో ఇది అవసరం ఉంటుంది.