2075 నాటికి భారతదేశం ప్రపంచంలోనే  నెంబర్ 2 ఆర్థిక వ్యవస్థ: గోల్డ్‌మ్యాన్ శాక్స్ అంచనా

శరవేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న భారత్, 2075 నాటికి ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా ఉన్న అమెరికాను వెనక్కి నెట్టి రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించనుందని ఓ నివేదిక పేర్కొంది.

India to be world's No. 2 economy by 2075: Goldman Sachs predicts MKA

శరవేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న భారత్.. 2075 నాటికి ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా ఉన్న అమెరికాను అధిగమించి ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించనుందని గోల్డ్‌మ్యాన్ శాక్స్  నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం భారత్ జీడీపీ రూ.44 లక్షల కోట్లు కాగా, అమెరికాది రూ.430 లక్షల కోట్లుగా ఉంది. 2075 నాటికి భారతదేశ జిడిపి 52.5 ట్రిలియన్ డాలర్లను దాటుతుందని నివేదిక పేర్కొంది.

140 కోట్ల జనాభాతో భారతదేశ జిడిపి (వృద్ధి రేటు) అనూహ్యంగా విస్తరిస్తుందని. అమెరికాకు చెందిన బహుళజాతి పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ 2075 నాటికి అమెరికా జిడిపిని అధిగమిస్తుందని అంచనా వేసింది. భారతదేశ GDP వృద్ధిలో ఆవిష్కరణలు, సాంకేతికతలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పేర్కొంది. అంతేకాకుండా, కార్మిక శక్తి భాగస్వామ్యం, టాలెంట్ పూల్, పని చేసే వయస్సు జనాభా నిష్పత్తి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పేర్కొంది. శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు పెరగకుంటే ఇది కార్యరూపం దాల్చకపోవచ్చని గోల్డ్‌మన్ సాక్స్ హెచ్చరించింది.

మరోవైపు ప్రపంచంలోనే సావరిన్ వెల్త్ ఫండ్స్ (ప్రభుత్వ బాండ్లు)కు అత్యంత ప్రాధాన్య గమ్యస్థానంగా చైనాను భారత్ అధిగమించిందని ఇన్వెస్కో గ్లోబల్ సావరిన్ అసెట్ మేనేజ్‌మెంట్ నివేదిక పేర్కొంది. భారతదేశంలో రాజకీయ సుస్థిరత ఉందని. చాలా త్వరగా ద్రవ్య నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారని. తద్వారా భారత్‌ను పెట్టుబడిదారులకు ఇష్టమైన గమ్యస్థానంగా అభివర్ణించింది.

57 సెంట్రల్ బ్యాంకులు ,  85 సావరిన్ వెల్త్ ఫండ్‌లకు చెందిన 142 మంది ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌లు ,  వివిధ ఆర్థిక నిపుణులను ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఈ అధ్యయనం జరిగింది. అధ్యయనంలో ఉన్న సంస్థలు 21 ట్రిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను నిర్వహిస్తున్నాయన్న సంగతి గుర్తుంచుకోవాలి. భారతదేశం నేడు రాజకీయ స్థిరత్వాన్ని కలిగి ఉంది. వ్యాపారానికి అద్భుతమైన ప్రదేశం. భారతదేశం నేడు విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకు పెట్టుబడి అనుకూల వాతావరణాన్ని కలిగి ఉంది. అత్యంత ఆకర్షణీయమైన అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటిగా భారత్ చైనాను అధిగమించింది. మెక్సికో, బ్రెజిల్‌ల మాదిరిగానే భారత్‌ కూడా పెట్టుబడుల వల్ల లాభపడుతోంది. కార్పొరేట్, ప్రభుత్వ పెట్టుబడుల నుండి పెట్టుబడిదారులు మంచి రాబడిని పొందుతున్నారని తెలిపింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios