Asianet News TeluguAsianet News Telugu

నీరవ్‌ను అప్పగించండి: బ్రిటన్‌కు భారత్‌ దరఖాస్తు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో రూ.14 వేల కోట్ల రుణ మోసానికి పాల్పడిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని తిరిగి అప్పగించాలని బ్రిటన్‌ను భారత్‌ కోరింది. ఈ మేరకు యునైటెడ్ కింగ్ డమ్ సెంట్రల్ అథారిటీకి లండన్‌లోని భారత హైకమిషన్‌ దరఖాస్తు సమర్పించింది.

India hands over extradition request for Nirav Modi to U.K. authorities

లండన్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో రూ.14 వేల కోట్ల రుణ మోసానికి పాల్పడిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని తిరిగి అప్పగించాలని బ్రిటన్‌ను భారత్‌ కోరింది. ఈ మేరకు యునైటెడ్ కింగ్ డమ్ సెంట్రల్ అథారిటీకి లండన్‌లోని భారత హైకమిషన్‌ దరఖాస్తు సమర్పించింది. అక్కడి హోం శాఖ ఈ దరఖాస్తును పరిశీలించి, నిర్ణయం తీసుకోనున్నది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని దోషుల అప్పగింత చట్టం 2003 ప్రకారం భారత్‌ రెండో కేటగిరీ దేశాల జాబితాలో ఉంది. ఈ విభాగ దేశాల అభ్యర్థనలపై యునైటెడ్ కింగ్‌డమ్ కోర్టుతోపాటు ఆ దేశ హోం మంత్రి అనుమతి కూడా అవసరం ఉంటుంది. నీరవ్‌ మోదీ ఇంకా బ్రిటన్‌లోనే ఉన్నాడా?  మరే దేశానికైనా పారిపోయాడా అనే విషయంపై అనిశ్చితి నెలకొన్నది.
 
ఈ ఏడాది ప్రారంభంలోనే బ్రిటన్‌కు చేరుకున్న నీరవ్‌మోదీ

యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వం వద్దనున్న సమాచారం ప్రకారం నీరవ్‌ మోదీ ఈ ఏడాది తొలినాళ్లలో భారత పాస్‌పోర్ట్‌పై లండన్‌కు చేరుకున్నాడు. నీరవ్‌ పాస్‌పోర్ట్‌ను రద్దు చేసినట్లు ఫిబ్రవరి 19న భారత అధికారులు బ్రిటన్‌ ప్రభుత్వానికి సమాచారం అందించారు. కానీ అప్పటికే నీరవ్‌ వారి దేశంలోకి ప్రవేశించాడని, మళ్లీ దేశం విడిచి వెళ్లినట్లు రికార్డులేం లేవని యునైటెడ్ కింగ్‌డమ్ హోం శాఖ మన ప్రభుత్వానికి తెలియజేసింది. అయితే, పాస్‌పోర్ట్‌ రద్దయినా.. నీరవ్‌ మోదీ బ్రిటన్‌ నుంచి కనీసం నాలుగుసార్లు ఇతర దేశాలకు వెళ్లివచ్చినట్లు తెలియవచ్చింది.

భారత్ క్లియరెన్స్ ఇచ్చాకే చౌక్సీకి సిటిజన్ షిప్: ఆంటిగ్వా వెల్లడి

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో నిందితులు పరారయ్యాక కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవహరించిన తీరుపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కోట్లు కొల్లగొట్టిన మెహుల్‌ ఛోక్సీ ప్రస్తుతం ఆంటిగ్వా దేశంలో మకాం వేశాడు. అతనికి ఆంటిగ్వా పౌరసత్వం కూడా ఉన్నది. కాగా ఛోక్సీకి తమ దేశ పౌరసత్వం ఉండడంపై ఆంటిగ్వా స్పందించింది. గతేడాది ఛోక్సీకి తాము పౌరసత్వం ఇచ్చామని తెలిపింది. అప్పుడు భారత ప్రభుత్వం నుంచి అందిన పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ పరిశీలించాకే పౌరసత్వం ఇచ్చామని వెల్లడించింది. 

ముంబైకి చెందిన విదేశీ వ్యవహారాల రీజినల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయం నుంచి వచ్చిన ధ్రువపత్రంలోనూ ఛోక్సీపై ప్రతికూల అంశాలేమీ లేవని నిర్ధారించుకున్నాకే..అతనికి అనుమతిచ్చామని ఆంటిగ్వా వెల్లడించింది. ఛోక్సీ దరఖాస్తుపై కఠిన తనిఖీలు కూడా చేశామని తెలిపింది. ఏ సందర్భంలోనూ ఆయన దరఖాస్తుపై అనుమానాస్పద సమాచారం లేదని ఆంటిగ్వా పేర్కొంది. అయితే భారత్‌, ఆంటిగ్వాల మధ్య దోషుల అప్పగింతపై ఎలాంటి ఒప్పందం లేదు. కానీ ఛోక్సీని భారత్‌ను తీసుకెళ్లేందుకు ఆ దేశం వినతిని తాము గౌరవిస్తామని ఆంటిగ్వా సర్కారు హామీ ఇచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios