Asianet News TeluguAsianet News Telugu

రిపబ్లిక్ డే వేళ తీపి కబురు: భారత జీడీపీ 9 శాతం వృద్ధి , ఐఎంఎఫ్ అంచనా.. మోడీపై రాజీవ్ చంద్రశేఖర్ ప్రశంసలు

73వ గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఇదిలావుండగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భారతీయులకు తీపికబురు చెప్పింది. నివేదిక ప్రకారం.. యుఎస్,  చైనా సహా అనేక దేశాల జిడిపి పడిపోయింది. కానీ భారతదేశం 9 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.

imf report says india gdp growth estimate 9 union minister rajeev chandrasekhar praises pm narendra modi
Author
New Delhi, First Published Jan 26, 2022, 7:19 PM IST

73వ గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఇదిలావుండగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భారతీయులకు తీపికబురు చెప్పింది. IMF ప్రస్తుత ఆర్థిక సంవత్సరం GDP వృద్ధి అంచనాలను ప్రచురించింది. నివేదిక ప్రకారం.. యుఎస్,  చైనా సహా అనేక దేశాల జిడిపి పడిపోయింది. కానీ భారతదేశం 9 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.

ఆర్థిక మాంద్యం, ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు సహా తదితర కారణాల వల్ల ప్రతి దేశ GDP క్షీణిస్తోంది. అయితే, 2022లో భారత జిడిపి 9.5 శాతానికి పెరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. ఇందుకు తగ్గట్లుగానే భారత జీడీపీ 9 శాతం పెరుగుతుందని ఐఎంఎఫ్ తన నివేదికలో పేర్కొంది. దీనిపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తన సంతోషాన్ని పంచుకున్నారు. భారతదేశ వృద్ధిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని... బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలతో పోలిస్తే భారత్ గరిష్ట జీడీపీ వృద్ధిని సాధిస్తోందని రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అమెరికా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, రష్యా, మెక్సికో , ఇటలీ సహా ప్రధాన దేశాల GDP అభివృద్ధి చెందిన.. అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో పడిపోతుందని భావిస్తున్నారు. నివేదికలో జపాన్ జిడిపిలో 4 శాతం , భారత్ 9 శాతం వృద్ధి సాధిస్తుందని ఐఎంఎఫ్ పేర్కొంది. 2020-21లో భారత్ జిడిపిలో 7.3 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. అలాగే 2022-23లో భారత్‌లో జిడిపితో పాటు ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతుందని ఐఎంఎఫ్ చెబుతోంది. ఆశించిన పెట్టుబడి, రుణ వృద్ధి బాగున్నాయని తెలిపింది. ఆర్థిక రంగం వృద్ధి... అంచనాలను మించి ఉంటుందని ఐఎంఎఫ్ తన నివేదికలో పేర్కొంది.

దీనితో పాటు IMF తన నివేదికలో ప్రపంచ పురోగతిని సైతం ఉదహరించింది. ఇది 2021లో 5.9 శాతానికి, 2022లో 4.4 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఏడాదిలో ప్రపంచ పురోగతికి భారత్ సహకారం పెరిగిందని తెలిపింది. ఇదే సమయంలో ఇతర బలమైన దేశాలు పురోగతిలో క్షీణతను చవిచూశాయి. 

ముఖ్యంగా చైనా ఆర్థిక వ్యవస్థకి గట్టి దెబ్బ తగిలింది. కరోనా సమయంలో చైనా విధానాలు GDP వృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని ఐఎంఎఫ్ వెల్లడించింది. కోవిడ్ జీరో టాలరెన్స్ పాలసీ , ప్రాపర్టీ డెవలపర్‌లపై ఆర్థిక ఒత్తిడి కారణంగా చైనా పురోగతి 0.8 శాతం తగ్గుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నివేదిక పేర్కొంది. అమెరికా.. పురోగతి కంటే GDPలో క్షీణతను చూస్తుందని IMF వెల్లడించింది. అగ్రరాజ్యం 1.2 శాతం క్షీణతను ఎదుర్కొంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు మొగ్గు చూపుతోంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios