కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన న్యూఏజ్ గవర్నెన్స్ ‘ఉమాంగ్’ యాప్ దేశ పౌరులకు అనేక రకాలైన సేవలను అందిస్తోంది. ప్రస్తుతం మనం పర్మినెంట్ అకౌంట్ నెంబర్(పాన్) వివరాలను ఈ ఉమాంగ్ యాప్ ద్వారా ఎలా అప్‌డేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. 

పాన్ అనేది ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించే ప్రతీ ఒక్కరికీ అవసరమే. బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ సమయంలో గానీ, ఆదాయపుపన్ను రిటర్న్(ఐటీఆర్) ఫైలింగ్ చేసే సమయంలో గానీ పాన్ కార్డు తప్పనిసరి. 
ఉమాంగ్ యాప్ పాన్ కార్డ్ సంబంధించిన పలు సేవలను కూడా అందిస్తోంది. దగ్గర్లో ఉన్న పాన్ కార్డు కేంద్రాలు, పాన్ కార్డ్ పేమెంట్ లాంటి సేవలను అందిస్తోంది.

ఉమాంగ్ యాప్ ద్వారా పాన్ కార్డ్ వివరాలు అప్‌డేట్ చేయడం ఎలాగంటే.?

1. మొదట ప్లేస్టోర్ నుంచి ఉమాంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

2. ఆ తర్వాత యాప్ ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వండి. అనంతరం ‘మై పాన్’పై క్లిక్ చేయండి.

3. వెంటనే మీరు పాన్ కార్డ్ సేవల పేజీలోకి వెళ్లిపోతారు.  "Correction/Change in PAN card CSF"పై క్లిక్ చేయండి. సీఎస్ఎఫ్ అనేది పాన్ కార్డ్ కరెక్షన్ ఫాం, ఇందులో తప్పుగా ఉన్న వాటిని సరిచేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

4. ఆ తర్వాత Application for correction (CSF)' అనే కొత్త పేజీ చూపిస్తుంది. మీ పాన్ కార్డ్ నెంబర్ రాసి nextపై క్లిక్ చేయండి.

5. ఫాంలో ఉన్న మీ వివరాలు నింపండి. సరిచేయాల్సిన వివరాలు నింపండి. ఆ తర్వాత సబ్మిట్‌పై క్లిక్ చేయండి. 

6. ఈ పేజీలో పేమెంట్, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

7. ఫాంతోపాటు నేషనల్ సెక్యూరిటీస్ డిపాసిటరీ లిమిటెడ్(ఎన్ఎస్‌డీఎల్) TIN(టాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్) ఫెసిలిటేషన్ సెంటర్ లేదా పాన్ సెంటర్‌లో సబ్మిట్ చేయండి. 

ఒక్కసారి మీ వివరాలు సరిచూసుకున్న తర్వాత మీ నివాసానికి కొత్త పాన్, అప్‌డేట్ చేసిన వివరాలతో అందుతుంది. మై పాన్‌లోని పాన్ క్వారీలో ట్రాక్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా అయితే పాన్ క్వారీలో కరెక్షన్ ఫాం డౌన్‌లోడ్  చేసుకుని, దగ్గర్లోని పాన్ సెంటర్‌లో అవసరమైన డాక్యుమెంట్లతోపాటు  సబ్మిట్ చేయాలి.
 

చదవండి: పాన్ కార్డ్ అడ్రస్ అప్‌డేట్(ఆఫ్‌లైన్/ఆన్‌లైన్లో) చేసుకోండిలా..