Asianet News TeluguAsianet News Telugu

పాన్ కార్డ్ అడ్రస్ అప్‌డేట్ చేసుకోండిలా..

పర్మినెంట్ అకౌంట్ నెంబర్(పాన్) కార్డు ఇప్పుడు ప్రతీఒక్కరికీ అవసరంగా మారింది. ఐటీ రిటర్న్ ఫైల్ చేసేవారికి, ఆర్థిక లావాదేవీలు జరిపేవారికి పాన్ తప్పనిసరి. పాన్ కార్డును ఆదాయపుపన్ను శాఖవారు జారీ చేస్తారు.  పాన్ కార్డుపై 10 ఆల్ఫాన్యూమరిక్ నెంబర్లు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో నెంబర్ కేటాయించడం జరుగుతుంది.

Want to change communication address in PAN card? Here's how to  do it offline and online
Author
Hyderabad, First Published Apr 13, 2019, 10:34 AM IST

పర్మినెంట్ అకౌంట్ నెంబర్(పాన్) కార్డు ఇప్పుడు ప్రతీఒక్కరికీ అవసరంగా మారింది. ఐటీ రిటర్న్ ఫైల్ చేసేవారికి, ఆర్థిక లావాదేవీలు జరిపేవారికి పాన్ తప్పనిసరి. పాన్ కార్డును ఆదాయపుపన్ను శాఖవారు జారీ చేస్తారు.  పాన్ కార్డుపై 10 ఆల్ఫాన్యూమరిక్ నెంబర్లు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో నెంబర్ కేటాయించడం జరుగుతుంది.

ఒక్కసారి పాన్ కార్డ్ తీసుకున్న తర్వాత పాన్ నెంబర్‌ను మార్చడం కుదరదు. అయితే, కార్డులోని వివరాలను మాత్రం అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంది. ఒక వేళ మీ అడ్రస్ మార్చాలనుకుంటే.. మార్చుకోవచ్చు. అయితే, అడ్రస్ మార్పు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పద్ధతిలో ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆఫ్‌లైన్‌లో పాన్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం ఎలా?

పాన్ కార్డులో అడ్రస్ వివరాలు అప్‌డేట్ చేసేందుకు కొత్త పాన్ కార్డ్ లేదా పాన్ కరెక్షన్ ఫామ్ నింపాలి.

ఏఏ వివరాలు అప్‌డేట్ చేయాలనుకుంటున్నారో తెలపాలి.
కొత్త అడ్రస్‌ను తప్పులు లేకుండా రాయాలి.

మీరు ఏ అడ్రస్ అయితే అప్‌డేట్ చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్ ప్రూఫ్ జతపర్చాలి.

దరఖాస్తును మీకు దగ్గర్లో ఉన్న ప్యాన్ కేంద్రంలో ఇవ్వాలి.

ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే ప్రింట్ తీసుకోవాలి. ఆ తర్వాత దానిపై సంతకం చేసి, ఈ కింది అడ్రస్‌కు పంపాలి.

Income Tax PAN services unit (Managed by NSDL e-Governance Infrastructure Limited),
5th Floor, Mantri Sterling, Plot No. 341, Survey No. 997/8,
Model Colony, Near Deep Bungalow Chowk, Pune - 411 016.

ఆన్‌లైన్‌లో పాన్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం ఎలాగంటే..?

ఎన్ఎస్‌డీఎల్ అధికారిక వెబ్‌సైట్ https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html సందర్శించాలి.

ఆన్‌లైన్ పాన్ అప్లికేషన్ పేజీలో ‘Application Type’పైన క్లిక్ చేసి.. 'Changes or Correction in existing PAN Data/Reprint of PAN Card’ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

ఆ తర్వాత డ్రాప్‌డైన్‌లో 'Individual' పైన్ క్లిక్ చేసి మీ వ్యక్తిగత వివరాలు, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన అనంతరం సబ్మిట్ క్లిక్ చేయాలి.

ఆ తర్వాత కొత్త పేజీలో మీకు టోకెన్ నెంబర్ వస్తుంది.

ఇ-సైన్ ద్వారా స్కాన్ చేసిన ఇమేజెస్‌ని అప్‌లోడ్ చేయాలి.

పర్సనల్ డీటైల్స్ పేజీలో అడ్రస్ బాక్స్ టిక్ చేయాలి.

కొత్త అడ్రస్‌ను తప్పులు లేకుండా రాయాలి.

మీరు ఏ అడ్రస్ అయితే అప్‌డేట్ చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్ ప్రూఫ్‌ను కూడా సబ్మిట్ చేయాలి.

ఆ తర్వాత దరఖాస్తును సరిచూసుకుని సబ్మిట్ చేయాలి.

ఇక అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ జనరేట్ అయిన తర్వాత, ఆ స్లిప్ ప్రింట్ తీసుకోవాలి.
అప్లికేషన్ ప్రింట్ తీసి INCOME TAX PAN SERVICES UNIT (Managed by NSDL e-Governance Infrastructure Limited), 5th floor, Mantri Sterling, Plot No. 341, Survey No. 997/8, Model Colony, Near Deep Bungalow Chowk, Pune - 411 016 చిరునామాకు పంపాలి. దీంతో మీ అడ్రస్ అప్‌డేట్ పూర్తయినట్లే.

చదవండి: ఆఫ్‌లైన్‌లో ‘పాన్’ దరఖాస్తు: ఈ 10 తప్పులు చేయొద్దు

Follow Us:
Download App:
  • android
  • ios