బ్యాంకులో డబ్బులు వేసినప్పుడు గానీ.. తీసినప్పుడు గానీ మీకు తెలియాలంటే మీ మొబైల్ ఫోన్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ అలర్ట్ తప్పనిసరి. అందుకు మీ ఫోన్ నెంబర్.. మీ బ్యాంక్ అకౌంట్‌కు జత చేసి ఉండాలి. ఎస్ఎంఎస్ అలర్ట్ యాక్టివేట్ చేసివుండాలి.

మీకు తెలియకుండా ఎవరైనా డబ్బులు డ్రా చేసుకున్నా మీకు తెలిసే అవకాశం ఉండదు. అందుకే ఎస్ఎంఎస్ అలర్ట్ యాక్టివేట్ చేసుకోవడం తప్పనిసరి. అంతేగాక, ఎస్ఎంఎస్ అలర్ట్‌తో మీ అకౌంట్‌కు సంబంధించిన సమాచారం అంటే పాస్‌వర్డ్ మార్చినప్పుడు, ఎక్కడైనా మీ ఖాతాలో లాగిన్ అయినప్పుడు కూడా మీకు తెలుస్తుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో అయితే ఎస్ఎంఎస్ ద్వారా ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడం కూడా సాధ్యమే. అందుకే ఎస్బీఐ అకౌంట్‌కు ఎస్ఎంఎస్ అలర్ట్స్ యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 

ఎస్ఎంఎస్ అలర్ట్ యాక్టివేట్ చేయండిలా..

1. ముందుగా ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ https://www.onlinesbi.com ఓపెన్ చేయాలి.

2. మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.

3. ఇ-సర్వీసెస్‌ సెక్షన్‌లో ‘SMS alerts’పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత స్టెప్‌లో ‘SMS alerts registration/updation’ పేజీ కనిపిస్తుంది.
అందులో కావాల్సిన సమాచారాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఎస్బీఐ‌లో ఎస్ఎంఎస్ అలర్ట్స్ యాక్టివేట్ అవుతుంది.