దేశంలో అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (UHNWI) అత్యంత ధనికులు అధికంగా ఉన్న నగరాల్లో ముంబై తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది.
దేశంలో అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (UHNWI) అత్యంత ధనికులు అధికంగా ఉన్న నగరాల్లో ముంబై తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2022 ప్రకారం 1596 మంది అత్యంత ధనికులతో ముంబై మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 467 మందితో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్ ధనికుల సంపద 30 మిలియన్ డాలర్లు లేదా దాదాపు రూ.225 కోట్లుగా ఉంది. వచ్చే నాలుగయిదేళ్లలో హైదరాబాద్‌లో అత్యంత ధనికుల సంఖ్య మరింత పెరుగుతుందని ఈ నివేదిక తెలిపింది.
నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2022 ప్రకారం ముంబై (1596), హైదరాబాద్ (467) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్‌లో అత్యంత ధనికుల సంఖ్య 2026 నాటికి 728కి పెరుగుతుందని అంచనా. గత అయిదేళ్లలో హైదరాబాద్‌లో వీరి సంఖ్య 314 నుండి 48.7 శాతం పెరిగి 467కు చేరుకుంది. దేశవ్యాప్తంగా అత్యంత ధనికులు 2020లో 12,287 ఉండగా, 2021లో ఆ సంఖ్య 13,637కు పెరిగింది. దాదాపు 11 శాతం పెరిగింది. 2026 నాటికి మన దేశంలో అత్యంత ధనికుల సంఖ్య 19,006కు చేరుకోవచ్చునని నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా 2020లో 5.58 లక్షలమంది అత్యంత ధనికులు ఉండగా, 2021 నాటికి ఈ సంఖ్య 6.10 లక్షలకు పెరిగింది. మన దేశంలో అత్యంత ధనవంతులు ఇళ్లు, కమర్షియల్ బిల్డింగ్స్, ఆఫీస్ స్పేసెస్ కొనుగోలుకు వెచ్చిస్తున్నారు. అలాగే ఈక్విటీ, రీట్స్‌లోను ఇన్వెస్ట్ చేస్తున్నారు. సొమ్ములో దాదాపు 60 శాతం స్థిరాస్తికి కేటాయిస్తున్నారు. క్రిప్టో కరెన్సీ, ఎన్ఎఫ్‌టీలలోను పెట్టుబడులు పెడుతున్నారు. ఈ పెట్టుబడుల్లో 20 శాతం క్రిప్టోల్లోకి వెళ్తున్నాయి. అలాగే, 11 శాతం తమ అభిరుచులకు (బంగారం, కార్లు, హ్యాండ్ బ్యాగ్స్) అనుగుణంగా వెచ్చిస్తున్నారు.
స్టాక్ మార్కెట్లు గణనీయంగా రాణించడం, డిజిటల్ టెక్నాలజీ విస్తరణతో భారత్‌లో ధనికుల సంఖ్య పెరుగుతోందని నైట్ ఫ్రాంక్ సీఎండీ తెలిపారు. యువకులు, స్వతంత్రంగా ఎదిగిన వారు పెద్ద ఎత్తున సంపదను సృష్టిస్తున్నట్లు తెలిపారు. కొత్త వ్యాపార రంగాలు ఆవిర్భవించడం, అధిక పెట్టుబడులను ఆకర్షించడం కూడా వీలు కల్పించడం వంటి కారణాల వల్ ధనికుల సంఖ్య మన దేశంలో వేగంగా పెరుగుతోంది.
