టాటా సన్స్ బ్యాంక్ అక్కౌంట్ నుండి 200 కోట్లు హ్యాక్...
టాటా సన్స్ బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసి రూ. 200 కోట్లు దోచుకోవడానికి ప్రయత్నించిన ఏడుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారు తమ వ్యూహాన్ని అమలు చేసే ముందే పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
టాటా సన్స్ సంబంధించి ముంబై నగరంలోని చెంబూర్ ఇండస్‌ఇండ్ బ్యాంకు శాఖలో ఖాతా ఉంది. ఫిక్సెడ్ డిపాజిట్ అయిన బ్యాంక్ అక్కౌంట్ కొంతకాలంగా ఇన్ ఆక్టివ్ లో ఉంది
అయితే 200 కోట్ల రూపాయలను టాటా సన్స్ ఖాతా లోంచి హ్యాక్ చేయడానికి కొందరు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నానికి ముందే ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఉద్యోగితో సహా ఏడుగురిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.గురువారం సాయంత్రం 5:30 గంటల సమయంలో ఒక మాల్ పార్కింగ్ ప్రాంతం దగ్గర ఏడుగురిని అరెస్టు చేశారు.
also read అంగవైకల్యాన్ని జయించి దేశంలోనే ఏకైక మహిళాగా ఎదిగి...
ఒక ఇంగ్లిష్ కధనంలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం పోలీసులు వారి నుంచి ఒక కీప్యాడ్, తొమ్మిది మొబైల్స్, టాటా సన్స్ బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్‌కు అనుసంధానించబడిన టాబ్లెట్‌ను వారు స్వాదినం చేసుకున్నారు. అయితే టాటా సన్స్ ఖాతాపై ఎలాంటి హ్యాక్ ప్రయత్నాలు జరగలేదని, తమ భద్రతా విభాగాలకు ఎలాంటి సమాచారం లేదని ఇండస్‌ఇండ్ బ్యాంక్ ప్రకటించింది.
పట్టుబడ్డ వారిలో ఇండస్ఇండ్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్ తస్లీమ్ అన్సారీ, టెక్ నిపుణుడు అనంత్ భూపతి ఘోష్, నసీమ్ యాసిన్ సిద్దిఖీ, గుంజీవ్ షాంజీభాయ్ బరయ్య, సరోజ్ రామ్నివాస్ చౌదరి, సతీష్ అజలాదే ఉన్నారు.
also read వచ్చే ఐదేళ్లలో రెట్టింపు కానున్న సంపన్నులు...దాదాపు 219 కోట్లు...
వారిని సెక్షన్ 420, 511 కింద ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ సిద్వా జయభాయ్ చెప్పారు. అయితే, ఈ విషయంపై కొనసాగుతున్న దర్యాప్తు వివరాలను వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు.
విచిత్రమేమిటంటే పట్టుబడ్డ ముఠా సభ్యులలో ఇద్దరు నసీమ్ సిద్దిఖీ, ఆనంద్ నాలావాడే పట్టుబడటానికి రెండు రోజుల ముందు ఒక మైక్రో ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించారు. దానికి లిమ్రా ఇంక్ మైక్రో ఫైనాన్స్ కంపెనీ అని పేరు కూడా పెట్టారు.
పోలీసుల కథనం ప్రకారం, నసీమ్ మొత్తం ప్రణాళిక వెనుక సూత్రధారి మరియు అతను నాగాలాండ్ కేంద్రంగా ఉన్న తన పరిచయంతో కూడా సన్నిహితంగా ఉన్నాడు. తన నాగాలాండ్ ఆధారిత పరిచయానికి 20% కమిషన్ ఇస్తానని వాగ్దానం చేశాడు.