బంగారం ధరలు మళ్ళీ పరుగో.. పరుగు..10 గ్రాముల ధర ఎంతంటే ?
ఇక అంతర్జాతీయ ధోరణికి తోడు, దేశంలో రూపాయి బలహీనత బంగారానికి వరంగా మారుతోంది. మంగళవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ 43 పైసలు పడిపోయి, 16 నెలల కనిష్ట స్థాయి 73.19కి చేరింది.
హైదరాబాద్‌లో బంగారం రేట్లు ప్రపంచ బంగారం రేట్లపై ఆధారపడి ఉంటాయి, ఇవి ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ బంగారం నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కరణలపై బంగారం ధరలు ప్రభావితమవుతాయి.
ఆర్థిక మందగమనం, కరోనా వైరస్ కష్టాల నేపథ్యంలో సరళతర ద్రవ్య విధానాలు అవలంభించడానికి సంబంధించి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్‌పై అధ్యక్షుడు ట్రంప్ సోమవారంనాటి విమర్శలు, దీంతో ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయంంతో బంగారం ధర మళ్లీ భారీగా దూసుకెళ్లింది.
also read అమెజాన్ ఉద్యోగికి కరోనావైరస్ పాజిటివ్ లక్షణాలు...
మంగళవారం రాత్రి అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్‌లో ఔన్స్ ధర 50 డాలర్ల పెరుగుదలతో 1,644 డాలర్ల వద్ద ట్రేడయింది. నిజానికి వారం క్రితం ఏడేళ్ల గరిష్టం 1,691 డాలర్లకు చేరిన బంగారం గత వారం ముగిసేనాటికి 1,565 డాలర్ల వరకూ పడిపోయింది.
ఇక అంతర్జాతీయ ధోరణికి తోడు, దేశంలో రూపాయి బలహీనత బంగారానికి వరంగా మారుతోంది. మంగళవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ 43 పైసలు పడిపోయి, 16 నెలల కనిష్ట స్థాయి 73.19కి చేరింది. 2018 అక్టోబర్ 9న రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది.
also read కరోనా వైరస్ భయంతో ట్విట్టర్ ఉద్యోగులకు కీలక ఆదేశాలు
దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో పసిడి 10 గ్రాముల ధర సోమవారంతో పోల్చితే రూ.1,289 లాభంతో రూ.43,245 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే బుధవారం పలు పట్టణాల్లోని స్పాట్ మార్కెట్లలో పసిడి 10 గ్రాముల ధర రూ.44,000 దాటిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.