కరోనా వైరస్ భయంతో ట్విట్టర్ ఉద్యోగులకు కీలక ఆదేశాలు
గత ఏడాది చివర్లో చైనాలో మొదలైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,100 మందికి పైగా మరణించారు.
శాన్ఫ్రాన్సిస్కో, యునైటెడ్ స్టేట్స్: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్విట్టర్ సిబ్బందిని సోమవారం నుండి వారి ఇంటి నుంచే ఆఫీస్ పనులు చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 5 వేల మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని కోరింది.
also read ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్...గ్రాట్యుటీ భారీగా పెంచుతూ నిర్ణయం...
గత ఏడాది చివర్లో చైనాలో మొదలైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,100 మందికి పైగా మరణించారు. అలాగే 90,000 మందికి పైగా ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. ఇది ఇంకా మెల్లమెల్లిగా వ్యాపిస్తూనే ఉంది.
"ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సంస్థ ఉద్యోగులందరూ ఇంటి నుంచే పనిచేసేందుకు మేము వారిని ప్రోత్సహిస్తున్నాము" అని ట్విట్టర్ హ్యూమన్ రిసోర్స్ చీఫ్ జెన్నిఫర్ క్రిస్టీ సోమవారం బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు."మా లక్ష్యం కోవిద్-19 కరోనావైరస్ వ్యాప్తిని ప్రపంచంవ్యాప్తంగా తగ్గించడం" అలాగే
also read ఆధార్ లింక్‌కు లాస్ట్ చాన్స్.. ఆ తర్వాత..రూ.10 వేలు ఫైన్!
ప్రభుత్వ ఆంక్షల కారణంగా దక్షిణ కొరియా, హాంకాంగ్, జపాన్ దేశంలోని కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా ఇంటి నుండి పనిచేయాలీ" అని క్రిస్టీ చెప్పారు.దక్షిణ కొరియాలో దాదాపు 5,000 మందికి కోవిద్-19 ఇన్ఫెక్షన్లు సోకినట్లు రికార్డుల్లో నమోదయ్యాయి. సగానికి పైగా కేసులు షిన్చోంజి చర్చ్ ఆఫ్ జీసస్‌తో ముడిపడి ఉన్నాయి.
దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేయాలని, యజమానులు తమ సిబ్బందికి రిమోట్‌గా పనిచేయడానికి అనుమతి ఇవ్వాలని జపాన్ ప్రభుత్వం కోరింది.గత వారంలో ట్విటర్ వ్యాపారనికి సంబంధించిన ప్రయాణలు, ఈవెంట్లను నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.