న్యూ ఢిల్లీ: బంగారం ధర నేడు కాస్త తగ్గింది. ప్రపంచ మార్కెట్లో బలహీనతపై జాతీయ రాజధానిలో బంగారం ధర సోమవారం 233 తగ్గి రూ .41,565 కు చేరిందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ తెలిపింది.

అంతకు ముందు సెషన్‌లో బంగారం 10 గ్రాములకు రూ .41,798 వద్ద ముగిసింది.బంగారం ధర తగ్గడంతో ఢిల్లీలో 24 క్యారెట్ల స్పాట్ బంగారం ధరపై రూ .233 తగ్గింది.

also read వైరల్ గా మారుతున్న మరో కిల్లింగ్ గేమ్

కరోనావైరస్  నివారించవచ్చు అలాగే అది సోకిన వారికి చికిత్స కూడా చేయవచ్చు అని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారి ఒకరు చెప్పిన తరువాత బంగారం ధరలు తక్కువ రేంజ్ లో  ట్రేడ్ అయ్యాయి ”అని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ చెప్పారు.

అదేవిధంగా వెండి ధరలు గత సెషన్‌లో కిలోకు రూ .47,327 నుండి 157 రూపాయలు తగ్గి 47,170 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ కు 1,579 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి ఔన్స్ కు దాదాపు 17.74 డాలర్ల వద్ద ఫ్లాట్ ట్రేడవుతోంది.

also read కరోనా వైరస్ కారణంగా పెరగానున్న స్మార్ట్​ఫోన్ ధరలు...

గత సంవత్సరం డిసెంబర్ 16న ఔన్సు బంగారం ధర 1472 డాలర్లు ఉండగా. ప్రస్తుతం 1583 డాలర్లకు ఎగిసింది. అంటే ఏకంగా 100 డాలర్లు పెరిగింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ఊపందుకుంటే మాత్రం అత్యంత వేగంగా బంగారం ధర తులం రూ.1 లక్ష దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంచనాలు వెలువడుతున్నాయి.

గతంలో సార్స్ వైరస్ కన్నా ప్రస్తుత కరోనా వైరస్ మరింతగా వ్యాపిస్తుండటంతో స్టాక్ మార్కెట్లపై ప్రభావం కొనసాగుతుంది. అటు చైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సైతం ప్రభావితం చేసే శక్తిగా కరోనా వైరస్ తయారవుతుంది.