Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్ కారణంగా పెరగానున్న స్మార్ట్​ఫోన్ ధరలు...

కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. వచ్చే 15 రోజుల్లో భారత్​లో స్మార్ట్​ఫోన్ల ధరలు ఏడు శాతం వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గుతున్నాయి. 

Smartphones Might Get Costlier Due To Components Supply Issues: Report
Author
Hyderabad, First Published Feb 17, 2020, 11:21 AM IST

న్యూఢిల్లీ: కరోనా వైరస్​ భయాలతో చైనాలో ఇప్పటికే చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. దాని ప్రభావం భారత్ పైనా పడింది. చైనా దిగుమతులపై ప్రధానంగా ఆధారపడి పనిచేస్తున్న మొబైల్​ ఫోన్ల పరిశ్రమపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. వైరస్​ భయాలతో చైనాలో స్మార్ట్​ఫోన్​ విడిభాగాల పరిశ్రమలు కార్యకలాపాలు నిలిపివేయడంతో భారత్​లో వాటి లభ్యత తగ్గిపోయింది. 

తత్ఫలితంగా మరో 15 రోజుల్లో స్మార్ట్​ఫోన్లు, ఫీచర్​ ఫోన్ల విడిభాగాల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వీటికనుగుణంగా ఆయా స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీలు ఫోన్ల ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

also read ట్రంప్‌ పర్యటనపై ఇండియన్ కార్పొరేట్ల భారీ ఆశలు....

ఫీచర్​ఫోన్ల ధరలు 10 శాతం, స్మార్ట్​ఫోన్ల ధరలు 6-7 శాతం పెరిగే అవకాశాలున్నాయని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో 15 నుంచి 20 రోజుల్లో మార్పు కనిపించనుందని నిపుణులు అంటున్నారు.

భారత్​లో అతిపెద్ద మొబైల్​ సంస్థగా ఉన్న షియోమీ ఇప్పటికే రెడ్​మీ 8 మోడల్​ ధర పెంచేసింది. ప్రీమియం స్మార్ట్​ఫోన్ల ధరల్లో మాత్రం పెద్దగా మార్పు ఉండదని విశ్లేషకులంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం దేశంలో ప్రీమియం సెగ్మెంట్​ ఫోన్ల మార్కెట్​ చాలా తక్కువగా ఉండటమే.

Smartphones Might Get Costlier Due To Components Supply Issues: Report

భారత స్మార్ట్​ఫోన్​ మార్కెట్​పై ఆరు నెలల వరకు పెరిగిన ధరల ప్రభావం ఉండొచ్చని మెగ్​ఆజ్​ మొబైల్ చీఫ్​ సేల్స్ ఆఫీసర్ నిఖిల్​ చోప్రా తెలిపారు. కరోనా వైరస్ భయాలతో స్పెయిన్ బార్సిలోనాలో జరగాల్సిన వరల్డ్ మొబైల్ కాంగ్రెస్​ను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ టెలికాం పరిశ్రమ సంస్థ జీఎస్​ఎం అసోసియేషన్ ఇటీవల ప్రకటించిన విషయం విదితమే.

also read మళ్ళీ తేరుచుకొనున్న ఆపిల్ ఐఫోన్ స్టోర్లు....

కరోనా వైరస్​ ప్రభావం​ ముడి చమురుపై మాత్రం ఇతర పరిశ్రమల కన్నా భిన్నంగా ఉంది. చైనా దిగుమతి చేసుకోవడం తగ్గించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దాదాపు ఏడాది కనిష్ఠానికి పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

భారత్​పై ఈ ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. దేశీయ చమురు సంస్థలు ఇటీవలి పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా తగ్గిస్తూ వస్తున్నాయి. కొన్ని ప్రధాన నగరాల్లో వీటి ధరలు ఐదు నెలల కనిష్ఠానికి పడిపోయాయి.

Follow Us:
Download App:
  • android
  • ios