Asianet News TeluguAsianet News Telugu

బడ్జెట్ ప్రవేశపెట్టిన 48 గంటల్లోపే.. తేల్చేసిన ‘ఫిచ్’

బడ్జెట్ ప్రవేశపెట్టిన 48 గంటల్లోపే ఇంటర్నేషనల్ రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ జీడీపీ వ్రుద్ధిరేటు ఎలా ఉంటుందో తేల్చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ వ్రుద్దిరేటు 5.6 శాతమేనని కుండబద్ధలు కొట్టింది. ఇది బడ్జెట్ ప్రతిపాదనల్లో విత్త మంత్రి నిర్మలా సీతారామన్, అంతకుముందు ఆర్థిక సర్వే అంచనాల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. 

Fitch predicts India's FY21 GDP growth at 5.6 pc
Author
Hyderabad, First Published Feb 4, 2020, 12:14 PM IST

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టి 48 గంటలు కూడా కాకముందే ప్రముఖ ఇంటర్నేషనల్ రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ కుండ బద్ధలు కొట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ వ్రుద్ధి రేటుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21లో జీడీపీ గ్రోత్ రేట్ 5.6 శాతమేనని తేల్చేసింది. ఇది గతనెల 31వ తేదీన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం నాడు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఎకనమిక్ సర్వే అంచనాల కంటే తక్కువగా ఉంది. 

తర్వాత శనివారం కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం సందర్భంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వ్రుద్ధిరేటు కనీస స్థాయిలో పెరుగుతుందని అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ వ్రుద్ధిరేటు 6 నుంచి 6.5 శాతం మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వ్రుద్దిరేటు 5 శాతమేనని ప్రభుత్వమే అంగీకరించిన సంగతి తెలిసిందే.  

also read ఫోటోలు లీక్:అమెజాన్ సి‌ఈ‌ఓ పై అతని గర్ల్ ఫ్రెండ్ సోదరుడి దావా...

గతంతో పోలిస్తే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ అంచనాలు కాసింత మెరుగ్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దేశ వ్రుద్ధిరేటు ‘బీబీబీ-‘ విత్ స్టేబుల్ హోదానిస్తున్నట్లు ఫిచ్ ఇండియా డైరెక్టర్ థామస్ రాక్ మాకర్ తెలిపారు. అయితే బడ్జెట్ అంచనాలు మిస్ కావడంతోపాటు వరుసగా మూడో ఏడాది కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు లక్ష్యాలను చేరుకోవడం వెనుక పడింది. 

Fitch predicts India's FY21 GDP growth at 5.6 pc

గతేడాది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు 3.3 శాతంగా నిర్ధారించిన కేంద్రం.. తాజాగా దాన్ని 3.8 శాతానికి సవరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు 3.5 శాతంగా కేంద్రం అంచనా వేసింది. ఇదిలా ఉంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వ్రుద్దిరేటులో రుణాల వాటా 70 శాతం ఉంటుందని ఫిచ్ పేర్కొన్నది. అధికంగా ప్రభుత్వం రుణాలు తీసుకోవడం కూడా బలహీనతేనని ఫిచ్ పేర్కొంది. 

also read కరోనా వైరస్ దెబ్బకు చైనా స్టాక్ మార్కెట్లు విలవిల

మధ్య కాలికంగా జీడీపీకి మద్దతు తెలిపేందుకు కొన్ని ఆదాయం పన్ను శ్లాబ్‌ల్లో కోత విదించినా, విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడులపై ఆంక్షలు తగ్గించినా, మౌలిక వసతుల కల్పన రంగానికి నిధుల కేటాయింపుపైనా కేంద్రీకరించినా.. టెక్స్ టైల్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉత్పాదకత పెంచుకోవడానికి చర్యలు తీసుకోవాల్సిందని ‘ఫిచ్’ అభిప్రాయ పడింది. 

గతేడాది కార్పొరేట్ టాక్స్ తగ్గింపు, తాజాగా ఆదాయం పన్నులో శ్లాబ్ ల వల్ల ఆదాయం తగ్గినా.. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఆశాజనకంగానే కనిపిస్తున్నది. ఈ మూడు అంశాలు సరిగ్గా జరిగితే వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనాలు వాస్తవరూపం దాలుస్తాయని ఫిచ్ పేర్కొన్నది. కార్పొరేట్ పన్ను 30 నుంచి 22 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ వ్రుద్ధిరేటు 4.5 శాతంగా నమోదైంది. జీడీపీలో నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్ వాటా 0.8 శాతం. 

Follow Us:
Download App:
  • android
  • ios