అమెజాన్ వ్యవస్థాపకుడి గర్ల్ ఫ్రెండ్ లారెన్ సాంచెజ్ సోదరుడు  మైఖేల్ శాంచెజ్, జెఫ్ బెజోస్ తన పరువుకు భంగం కలిగించడాని ఆరోపించాడు. మైఖేల్  శాంచెజ్ ఒక నేషనల్ పత్రికకు జెఫ్ బెజోస్, లారెన్ సాంచెజ్ నగ్న ఫోటోలు వీడియొలు లీక్ చేశాడని అతని పై ఆరోపణలు ఉన్నాయి. 

శాన్ఫ్రాన్సిస్కో: అమెజాన్ వ్యవస్థాపకుడు, సిఇఒ జెఫ్ బెజోస్ పై అతని గర్ల్ ఫ్రెండ్ లారెన్ శాంచెజ్ సోదరుడు మైఖేల్ శాంచెజ్ పరువు నష్ట దావా కేసు వేశాడు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడుడైన జెఫ్ బెజోస్ అతని గర్ల్ ఫ్రెండ్ లారెన్ శాంచెజ్ నగ్న ఫోటోలు, వీడియొలు ఒక నేషనల్ పత్రికకు మైఖేల్ శాంచెజ్ లీక్ చేసి అమ్ముకున్నడని చెప్పి తనను పరువు తీశారని మైఖేల్ శాంచెజ్ తన పిటిషన్ లో ఆరోపించారు. 

also read కరోనా వైరస్ దెబ్బకు చైనా స్టాక్ మార్కెట్లు విలవిల

జనవరి 2019లో ఒక వార్తా పత్రిక లారెన్‌ శాంచెజ్ తో జెఫ్ బెజోస్ వివాహేతర సంబంధాన్ని మెసేజులతో సహ బహిర్గతం చేసింది.ఈ కేసులో జెఫ్ బెజోస్ నా పై చేసిన ఆరోపణల ఫలితంగా తన పరువు గణనీయమైన హాని కలిగించారని మైఖేల్ పేర్కొన్నాడు. తన ఇంటిపై ఎఫ్‌బి‌ఐ దాడి చేయడంతో పొరుగు ఇంటి వారి ముందు తన పరువు పోయింది అని తెలిపాడు.

ఫోటోలు, వీడియొలు లీక్ అయిన సమయంలో మైఖేల్ తన సోదరికి నమ్మకమైన మేనేజర్ గా పనిచేశానని తన పిటిషన్లో తెలిపాడు. మైఖేల్ చేసిన పేటిషన్ పై జెఫ్ బెజోస్ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.గత వారంలో జెఫ్ బెజోస్, లారెన్ నగ్న ఫోటోలు వీడియొలు లీక్ చేసినందుకు ఆ వరత పత్రిక నుండి 200,000 డాలర్లు పొందాడని మరొక పత్రిక తెలిపింది.

also read పూర్తిస్థాయిలో రైల్వేల ప్రైవేటీకరణకు నాంది... కొత్తగా 150 ప్రైవేట్ రైళ్లు

 మరోవైపు లారెన్ శాంచెజ్ తన సోదరుడు మైఖేల్ పిటిషన్‌పై స్పందిస్తూ అతనివి నిరాధార,నిజం లేని ఆరోపణలు అని పేర్కొంది. జెఫ్ బెజోస్, లారెన్ ఫోటోల లీక్‌లో తనకు ఎలాంటి సంబంధం లేదని మైఖేల్ ఖండించాడు. 2018 మేలో సౌదీ అరేబియా జెఫ్ బెజోస్ ఫోన్‌ను హ్యాక్ చేసిందని ఒక పత్రిక నివేదించడంతో బెజోస్ వ్యవహారం తిరిగి వార్తల్లోకి వచ్చింది.అయితే దీనిపై సౌదీ ప్రభుత్వం ఖండించింది.