ఢిల్లీ:  కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సితారామన్ ఈరోజు ఆర్థిక సర్వే నివేదిక‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేది వార్షిక పత్రం, ఇది ప్రధానంగా అంతకు ముందు సంవత్సరంలో ఆర్థిక స్థితిని సమీక్షించడానికి సమర్పిస్తుంది. వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలో వృద్ధి రేటు 6 శాతం నుంచి 6.5 శాతం ఉంటుంద‌ని నివేదిక పేర్కొన్న‌ది. 

also read Budget 2020:పదేళ్లలో ఆదాయం పన్నుపై సర్ చార్జి వసూళ్లు ఇలా..!!

  ఆర్థిక సర్వే నివేదిక‌ ప్రధాన కేంద్ర బడ్జెట్  బ‌డ్జెట్‌తో సమానంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి తీసుకోవలసిన కీలక విధాన నిర్ణయాలకు వివరణ ఇవ్వడమే కాక, అంతకుముందు తిసుకున్న నిర్ణయాల ప్రభావాన్ని వివరణాత్మకంగా గణాంకాల ద్వారా అంచనా వేస్తుంది.  

also read ఆర్ధిక మంత్రిగా నిర్మల’మ్మ రికార్డ్: కొత్త ఆర్థిక మంత్రిగా నెక్స్ట్ ఎవరు..?

చీఫ్ ఎక‌నామిక్ అడ్వైజ‌ర్ కృష్ణ‌మూర్తి సుబ్ర‌మ‌ణియ‌న్ త‌న టీమ్‌తో క‌లిసి ఈ నివేదిక‌ను త‌యారు చేశారు. రేపు నిర్మలా సీతారామన్ కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న త‌రుణంలో ఈ స‌ర్వే రిపోర్ట్‌ను ఈరోజు విడుదల చేశారు.