న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి గత వార్షిక బడ్జెట్‌లో వేతన జీవులకు వ్యక్తిగత ఆదాయం పన్నుపై రూ.12,500 రిబేట్ ప్రకటించారు.  రూ.5 లక్షల్లోపు ఆదాయం గల వారు పన్ను చెల్లించనక్కరలేదన్నారు. మరోవైపు సంపన్నులపై అంటే మొత్తం ఆదాయం రూ.5 కోట్లపై చిలుకు వారిపై పన్ను రేట్లు 35.88 శాతం నుంచి 42.744 శాతానికి పెంచుతూ ఆర్థిక మంత్రి గత బడ్జెట్ లో నిర్ణయించారు. 

రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల లోపు ఆదాయం గల వారిపై ఆదాయం పన్ను సర్ చార్జీ 15 నుంచి 37 శాతానికి పెంచారు. సర్ చార్జీ 25 శాతం పెరిగితే గరిష్ఠ పన్ను రేటు 39 వాతం పెరిగినట్లయింది. ఆర్ధిక మందగమనం, నేపథ్యంలో పారిశ్రామిక రంగానికి ఉద్దీపనలు కల్పించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విత్త మంత్రి పలు చర్యలు చేపట్టారు. ఆదాయం పన్ను చట్టం 1961లోని 80 సీ సెక్షన్ ప్రకారం వ్యక్తిగత ఆదాయం పన్ను మినహాయింపుపై గత పదేళ్లలో జరిగిన మార్పులన పరిశీలిద్దాం.. 

also read ఆర్ధిక మంత్రిగా నిర్మల’మ్మ రికార్డ్: కొత్త ఆర్థిక మంత్రిగా నెక్స్ట్ ఎవరు..?

2019-20 ఆర్థిక సంవత్సరంలో సూపర్ రిచ్‌లపై వ్యక్తిగత ఆదాయంపై పన్నును 10 నుంచి 37 శాతానికి పెంచారు. 

* 2013-14 ఆర్థిక సంవత్సరం నుంచి 2016-17 ఆర్థిక సంవత్సరం వరకు పూర్తి ఆదాయం రూ.కోటి దాటితే సర్ చార్జీ వర్తింపజేశారు. 


* 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో రూ.50 లక్షల ఆదాయం దాటిన వారిపై సర్ చార్జీ రేటును 10 శాతం తగ్గించాలి. రూ. కోటి దాటిన వారిపై 15 శాతం సర్ చార్జీ విధించారు.  

* 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.50 లక్షల ఆదాయం పెరిగిన వారిపై సర్ చార్జీ 10% విధించారు. మొత్తం ఆదాయం రూ. కోటి, రూ.2 కోట్ల నుంచి రూ. 5 కోట్లపై చిలుకు ఆదాయం సంపాదించిన వారిపై పై 15 శాతం, 25 శాతం, 37 శాతం సర్ చార్జి వసూలు చేశారు. 

also read Budget 2020:స్టార్టప్ సౌభాగ్యమే ముద్దు: ఏంజిల్ ప్లస్ ద్వంద్వ టాక్స్‌ను సమీక్షించాలి

*2019-20 ఆర్థిక సంవత్సరంలో అధిక పన్నులు విధించిన దేశాల జాబితాలో భారతదేశం నిలిచింది. ఆదాయం పన్నులో ఎడ్యుకేషన్ సెస్, సర్‌చార్జీ జత కలిపారు.  గత దశాబ్ద కాలంలో జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. 

గత దశాబ్ద కాలంలో ఆదాయం పన్ను (ఐటీ) 80 సీ సెక్షన్ కింద మెడికల్ ఇన్సూరెన్స్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ తదితర పథకాల్లో పెట్టుబడులకు మినహాయింపులు లభించాయి. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం నేపథ్యంలో అన్ని రంగాల్లో సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఆదాయం పన్నుపై విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా రాయితీలిస్తారా? లేదా? అన్న సంగతి మరో 24 గంటల్లో తేలనున్నది.