న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో శనివారం ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. నిరుద్యోగం, ఆర్థికలోటుతో దేశ ఆర్థికవ్యవస్థ తిరోగమనంలో ఉన్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ 2020-21 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

also read Budget 2020: ఆర్థిక సర్వే హైలెట్స్... రైతు పంట రుణాలతో నెగెటివ్ ఫలితాలు...

నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే ఆర్ధిక బడ్జెట్ పై దేశ ప్రజలు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఆదాయపన్ను పరిమితి పెంచుతారని, కర్షకుల సంక్షేమానికి మేలు చేసే పథకాలు ప్రవేశపెడతారని, ఆటోమొబైల్ పరిశ్రమపై జీఎస్టీ తగ్గించి దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేలా జనరంజక బడ్జెట్ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.

also read Budget 2020:పార్లమెంటులో ఆర్థిక స‌ర్వే ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర మంత్రి నిర్మ‌ల‌...

మరికొద్ది గంటల్లో నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నిర్మలా సీతారామన్ రెండోసారి కేంద్ర బడ్జెట్‌ దేశ ఆర్ధిక స్థితిని ఏ విధంగా మార్చుతుందో, ఎలాంటి కొత్త సంక్షేమా పథకాలు ప్రవేశపెడుతుందో, బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉంటాయో అనే విషయాల గురించి భారి అంచనలనే పెట్టుకున్నారు.