ఎంత స్పీడ్‌లో నడిపితే మీ బైక్ ఎక్కువ మైలేజ్ ఇస్తుందో తెలుసా?
Bike Mileage Tips: సరైన స్పీడ్ లో ప్రయాణం లేకుంటే బైక్ ఎక్కువ మైలేజ్ ఇవ్వదు. మరి మీ బైక్ ఎంత స్పీడ్ లో వేళ్తే మీకు ఎక్కువ మైలేజ్ ఇస్తుందో తెలుసా?
Bike Mileage Tips: ప్రస్తుతం మార్కెట్ లో చాలా రకాల బైకులు ఉన్నాయి. చాలా మంది మంచి లుక్, నాణ్యతతో పాటు మంచి మైలేజ్ ఇచ్చే బైకుల కోసం చూస్తుంటారు. కొంతమంది బైకులు 125 సీసీ అయినప్పటికీ వారి బైక్ నుండి కావలసిన మైలేజీని పొందలేరు? 90 నుంచి 125 సీసీలు ఉన్న బైకుల నుంచి కూడా ఒక్కోసారి మీకు మెరుగైన మైలేజ్ రాకపోవచ్చు. అయితే, ఇలా ఎందుకు జరుగుతుంది? అనే ప్రశ్న మీ మదిలో మెదిలే ఉంటుంది. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం.
బైక్ స్పీడ్ కూడా మైలేజీ పై ప్రభావం చూపుతుంది
బైకు మైలేజీ విషయంలో స్పీడ్ కూడా గణనీయమైన పాత్ర పోషిస్తుంది. సరైన వేగం లేకుండా బైక్ నడిపితే మంచి మైలేజ్ రాకపోవచ్చని ఆటో రంగ నిపుణులు చెబుతున్నారు. స్పీడ్ సరిగ్గా లేకపోతే బైక్ మైలేజీ ఇవ్వదు. అటువంటి పరిస్థితిలో మంచి మైలేజ్ పొందడానికి బైక్‌ను ఏ స్పీడ్‌లో నడపాలనే విషయం మీకు తెలిసి ఉండాలి.
బైక్ తయారీదారు సిఫార్సు చేసిన వేగం ఫాలో అవ్వండి
ప్రతి బైక్‌కు ఒక నిర్దిష్ట వేగం ఉంటుంది. అలాగే, ఏ వేగం వద్ద ఆ బైకు ఎక్కువ మైలేజీ ఇస్తుందనే విషయాలను కూడా సంబంధిత బైక్ కంపెనీ పేర్కొంటుంది. ఈ వివరాలు మీకు పాత బైక్ లలో అయితే స్పీడ్ మీటర్ లో సమాచారంతో అందిస్తారు. ఈ వేగం ఇంజిన్, గేర్‌బాక్స్, బైక్ ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీరు ఈ సమాచారాన్ని మీ బైక్ యూజర్ మాన్యువల్‌లో చూసుకోవచ్చు.
ఎకానమీ గేర్:
ప్రతి బైక్‌కు ఎకానమీ గేర్ ఉంటుంది. ఈ గేర్‌లో బైక్ తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది.
స్థిరమైన వేగం:
వేగంలో ఆకస్మిక పెరుగుదల లేదా తగ్గుదల, తరచుగా బ్రేకింగ్ ఇలాంటి కారకాలన్నీ ఇంధన వినియోగాన్ని పెంచుతాయి. మైలేజ్ తగ్గుతుంది. అందువల్ల, స్థిరమైన వేగంతో రైడింగ్ మీ బైక్ మైలేజీని పెంచుతుంది.
ఎయిర్ రెసిస్టెన్స్:
మీరు చాలా ఎక్కువ వేగంతో బైక్ నడుపుతున్నప్పుడు, గాలి నిరోధకత పెరుగుతుంది, దీని కారణంగా ఇంజిన్ కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. దీంతో ఇంధన వినియోగం పెరుగుతుంది. అంటే మీ బైక్ మైలేజ్ తగ్గుదలకు కారణంగా ఉంటుంది.
ఏ వేగంతో డ్రైవ్ చేయాలి?
సాధారణంగా దాదాపు చాలా బైకులు 40-60 km/h వేగంతో నడిపిస్తే ఎక్కువ మైలేజ్ ను ఇస్తాయి. అయితే, ఈ వేగం మీ బైక్ మోడల్, ప్రయాణించే రోడ్డు మార్గాలను బట్టి కూడా మారుతుంటుందనే విషయం గమనించాలి.
చలికాలంలో బైకు మైలేజీపై ప్రభావం ఎలా ఉంటుంది?
చలికాలం రాగానే ద్విచక్ర వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతుంటారు. పొగమంచు రైడింగ్ తో పాటు బైక్‌ను మెయింటెయిన్ చేయడం వంటివి శీతాకాలం కొత్త సవాళ్లుగా ఉంటాయి. శీతాకాలంలో బైకులు మంచి మైలేజ్ ఇవ్వాడానికి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
చలికాలం వచ్చేసరికి, మీ బైక్ టైర్‌ల ట్రెడ్ డెప్త్, ఎయిర్ ప్రెజర్‌ని చెక్ చేయండి. చల్లని వాతావరణంలో టైర్ ఒత్తిడి పడిపోవచ్చు, ఇది ట్రాక్షన్‌ను ప్రభావితం చేస్తుంది. ఇది మీ బైకు మైలేజ్ పై కూడా ప్రభావం చూపుతుంది.
అలాగే, శీతాకాలంలో ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, శీతలకరణి స్థాయిలను చెక్ చేసుకోవాలి. ఇంజిన్ ఆయిల్ చల్లని వాతావరణంలో స్తంభింపజేస్తుంది, ఇది మీ బైక్ మైలేజీని ప్రభావితం చేస్తుంది. చలికాలం రాగానే ఇంజన్ ఆయిల్‌ని మార్చండి, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
శీతాకాలం మీ బైక్ బ్యాటరీకి ప్రతికూల వాతావరణం అని చెప్పాలి. ఎందుకంటే చల్లని వాతావరణం దాని సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. చలికాలం ప్రారంభంలో బ్యాటరీ ఛార్జింగ్ సామర్థ్యాన్ని చెక్ చేయండి. బ్యాటరీ పాతది లేదా బలహీనంగా ఉంటే కొత్తదానిని మార్చుకోవడం ఉత్తమం.
ఇవి కూడా చదవండి:
2025 ఇండియాలో టాప్-5 మైలేజ్ బైకులు ఇవే
భారత జట్టు నుంచి రోహిత్ శర్మ తప్పుకున్నాడా? తప్పించారా?
బుమ్రా vs కాన్‌స్టాస్: సిడ్నీలో మాటల యుద్ధం.. బుమ్రా దెబ్బకు ఎగిరిపడ్డ వికెట్