2025 ఇండియాలో టాప్-5 మైలేజ్ బైకులు ఇవే
Top 5 Mileage Bikes in India 2025: తక్కువ ధర, వాడటానికి సులభమైన కమ్యూటర్ బైక్ కావాలా? మంచి మైలేజ్ తో ఇండియాలో బాగా అమ్ముడవుతున్న కొన్ని బైకులు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
2025లో ఇండియాలో ఇంధన సామర్థ్యం గల అంటే బెస్ట్ మైలేజ్, ఖర్చు తక్కువ కమ్యూటర్ బైకులకు డిమాండ్ ఎప్పుడూ లేనంతగా ఉంది. పెరుగుతున్న ఇంధన ధరలు, నమ్మకమైన రోజువారీ రవాణా అవసరం పెరుగుతున్న తరుణంలో, పనితీరుపై రాజీ పడకుండా ఉత్తమ మైలేజ్‌ను అందించే బైక్‌లకు రైడర్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
మీరు బిజీగా ఉండే నగర వీధుల్లో నడుపుతున్నా లేదా తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ దూరాలు ప్రయాణిస్తున్నా, ఈ అధిక-మైలేజ్ బైక్‌లు మంచి ఇంధన శక్తి సామర్థ్యం, మన్నిక, సౌకర్యాన్ని అందించేలా రూపొందించబడ్డాయి. ఇప్పుడు మనం 2025 లో ఇండియాలో ఉత్తమ మైలేజ్ కమ్యూటర్ బైక్‌ల గురించి తెలుసుకుందాం. ఈ టాప్ మైలేజ్ బైకులు మీ సమయం, డబ్బు రెండింటినీ ఆదా చేస్తూ మీ రోజువారీ ప్రయాణానికి సరైన ఎంపిక చేసుకోవడంలో మీకు సహాయం చేస్తాము.
1. హీరో స్ప్లెండర్, మైలేజ్ - 70 kmpl
హీరో స్ప్లెండర్ ఇండియన్ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కమ్యూటర్ బైక్‌లలో ఒకటి. ఈ బైక్ 97cc ఇంజిన్‌తో అమర్చబడి ఉంది. ఈ బైక్ చాలా కాలంగా దాని 70 kmpl మైలేజ్‌కు ప్రసిద్ధి చెందింది. ప్రస్తుత పరిస్థితుల్లో అంత మైలేజ్ రాబట్టడం కష్టమే అయినప్పటికీ, ఇది కమ్యూటర్ బైక్ విభాగంలో పేరున్న బైక్.
బైక్ సౌకర్యవంతమైన సీటింగ్‌ను అందిస్తుంది. దీని సీటు ట్యాంక్ నుండి బైక్ టెయిల్ లైట్ వరకు విస్తరించి ఉంటుంది. ఈ సీటులో ముగ్గురు సౌకర్యవంతంగా కూర్చుని ప్రయాణం చేయవచ్చు. ముగ్గురు వెళ్లాలని మేము చెప్పడం లేదు, ఈ బైక్ పోటీదారులతో పోలిస్తే బైక్ బలమైన అమ్మకాలకు ఇది ఒక కారణం. ఈ బైక్ 7.9 BHP @8000 rpm పవర్ అవుట్‌పుట్, 6000 rpm వద్ద 8.05 Nm టార్క్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది.
హోండా షైన్
2. హోండా షైన్- మైలేజ్ - 55 kmpl
రూ. 81,251 ధరతో, CB షైన్ స్ప్లెండర్ కంటే కొంచెం శక్తివంతమైనది, ఎందుకంటే ఇది 123cc ఇంజిన్‌తో శక్తినిస్తుంది. ఈ బైక్ దాని కంటే తక్కువ మైలేజ్‌ను అందిస్తుంది. ఒక లీటరు పెట్రోల్‌కు 55 kmpl మాత్రమే అందిస్తుంది. CB షైన్ రోజువారీ ప్రయాణికులకు స్టైల్, మైలేజ్ మిశ్రమాన్ని అందించడంలో చాలా ప్రజాదరణ పొందింది. అలాగే, హోండా కంపెనీ విశ్వసనీయత దీనిని కమ్యూటర్ విభాగంలో బలమైన బైక్‌గా నిలబెట్టింది.
HF డీలక్స్
3. HF డీలక్స్
మీకు HF డీలక్స్ పాత లుక్ నచ్చకపోతే.. కొత్త వేరియంట్ గా సరికొత్త లుక్ లోకి వచ్చిన కొత్త మోడల్ బైక్ ను ట్రై చేయవచ్చు. ఇది మీకు పనితీరు, మైలేజ్, స్టైల్ మూడు విభాగాల్లో అద్భుతమైన పనితీరును చూపిస్తుంది. రోజువారీ ప్రయాణాల కోసం నమ్మకమైన బైక్ కోసం చూస్తున్న ప్రయాణికులకు ఈ బైక్ సరైన ఎంపిక. 97.2 cc ఇంజిన్‌తో శక్తినిచ్చే ఈ బైక్ 8000 rpm వద్ద 8.02 PS, 6000 rpm వద్ద 8.05 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ బైక్ కండిషన్, డిజైన్ కూడా బాగున్నాయి. మంచి మైలేజ్ కూడ ఇస్తుంది.
సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ మోటారుతో దాని బలమైన నిర్మాణం, ఆకట్టుకునే ఇంధన సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. ఇది సుదీర్ఘ ప్రయాణాలకు, సిటీలో ప్రయాణాలకు అనువైనదిగా ఉంటుంది. ఇంజిన్ స్మూత్-షిఫ్టింగ్ గేర్‌బాక్స్‌తో మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. దాదాపు 70 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుందని రిపోర్టుల సమాచారం.
TVS స్పోర్ట్
4. TVS స్పోర్ట్ మైలేజ్ 80Kmpl
TVS కమ్యూటర్ బైక్ మార్కెట్‌లో చాలా ప్రజాదరణ పొందింది. ఈ బైక్‌లో 109.7cc ఇంజిన్ ఉంది. ఇది 4500 rpm వద్ద 8.7 Nm టార్క్‌ను అందిస్తుంది. వాహనం పవర్ అవుట్‌పుట్ 7350 rpm వద్ద 8.18 BHPగా ఉంది. TVS స్పోర్ట్స్ బైక్ 80 kmpl మైలేజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితుల్లో ఒక రైడర్ సులభంగా 60 నుండి 72 kmpl వరకు మైలేజ్ ను పొందవచ్చు.
ఈ బైక్ లో డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ వంటి అన్ని ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ వాహనంలో డిస్క్ బ్రేక్ తో పాటు ట్యూబ్ లెస్ టైర్ల సపోర్ట్ తో కూడా వస్తంది.
TVS రైడర్
5. TVS రైడర్ మైలేజ్ 56.7kmpl
రైడర్ ఇటీవలి కాలంలో అత్యంత సులువైన కమ్యూటర్ బైక్‌లలో ఒకటి. ఈ బైక్ ఈ విభాగంలోని ఇతర బైక్‌ల వలె కాకుండా ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంది. మీకు మంచి లుక్స్ ఉన్న కమ్యూటర్ బైక్ కావాలంటే, ఇది మీ జాబితాలో ఉంటుంది. 124.8cc ఇంజిన్‌తో ఈ బైక్ శక్తిని పొందుతుంది. ఇది 7500 rpm వద్ద 11.2 bhp పవర్, 6000 rpm వద్ద 11.2 Nm పీక్ టార్క్‌ను అందిస్తుంది. ఈ బైక్56.7 kmpl మైలేజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
ఇందులో iGO వేరియంట్ టెక్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది బైక్ సామర్థ్యాన్ని 10% మెరుగుపరుస్తుందని కంపెనీ పేర్కొంది. దృశ్యపరంగా రైడర్ iGO మిగిలిన లైనప్‌తో సమానంగా ఉన్నప్పటికీ, ఈ వేరియంట్ కాంట్రాస్టింగ్ స్పోర్టీ రెడ్ అల్లాయ్ వీల్స్‌తో కొత్త నార్డో గ్రే కలర్ తో వస్తుంది.